‘పవర్ స్టార్’లోని వైబ్రేషన్స్ ముందుగా తెలిసింది ఎవరికి?

posani-murali-krishna-on-power-starపవన్ కళ్యాణ్… పవన్ కళ్యాణ్… ఈ పేరులో అభిమానులకు ఒక మత్తు ఉంటుంది. ముఖ్యంగా ఈ పేరు పలికితే ఎక్కడలేని ‘పవర్’ జనరేట్ అవుతుంది. అయితే పవన్ కళ్యాణ్ కు అంతటి ‘పవర్’ ఉందన్న విషయం ముందుగా గుర్తించింది ఎవరు? అంటే… నేనే అంటున్నారు ప్రముఖ రచయిత, నటుడు పోసాని కృష్ణమురళీ. ఈ విషయాన్ని స్వయంగా పోసానే ‘ధృవ’ ప్రీ రిలీజ్ వేడుక మీద బహిరంగంగా ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ అభిమానులు ‘పవర్ స్టార్… పవర్ స్టార్…’ అంటూ కేకలు వేస్తున్న వేళ… ‘పవర్ స్టార్’ నినాదం అందుకున్న పోసాని, “మీరంతా ఇప్పుడు పవర్ స్టార్ అంటున్నారేమో… నిజానికి పవన్ కళ్యాణ్ కు ఆ బిరుదు పెట్టిందే నేను. ‘గోకులంలో సీత’ సినిమాకు రచయితగా పనిచేసిన తాను, ఈ సినిమా హిట్టయితే అందరూ నిన్ను ‘పవర్ స్టార్’ అంటారని ఆనాడే చెప్పానని” నాటి సంగతులు చెప్పడంతో అభిమానులు శాంతించారు.

ADVERTISEMENT

ఇటీవల కాలంలో ఆడియో వేడుకల్లో పవన్ అభిమానుల హంగామా ఉధృతి కాస్త తగ్గినప్పటికీ, మళ్ళీ ‘ధృవ’ ప్రీ రిలీజ్ వేడుకలో తమ సత్తా చూపించి, అతిధుల సహనాన్ని పరీక్షించారు. దీంతో ఒళ్ళు మండిన పోసాని లాంటి వారు, ఫ్లాష్ బ్యాక్ చెప్తూనే… అక్కడ సిట్యూయేషన్ తో సంబంధం లేనటువంటి అల్లు అర్జున్ ను దేశంలోనే బెస్ట్ డాన్సర్ అంటూ పవన్ అభిమానులను ఉడికించారు.

ADVERTISEMENT
Latest Stories