“బాహుబలి” అన్న పేరు చెప్పగానే దర్శకుడు రాజమౌళి ఎలా గుర్తుకు వస్తారో… టైటిల్ రోల్ పోషించిన ప్రభాస్, విలన్ రోల్ చేసిన రానా, హీరోయిన్ పాత్ర ధరించిన అనుష్కలు కూడా జ్ఞప్తికి వస్తారు. చరిత్రలో నిలిచిపోయేలా పోషించిన ఆ ముగ్గురు ప్రస్తుతం వారి వారి సినిమాలలో బిజీ అయిపోయారు. ‘బాహుబలి’ ప్రభాస్ ‘సాహో’ సినిమా చేస్తుండగా, దేవసేన అనుష్క ‘భాగమతి’ రూపంలో దర్శనమిస్తోంది. ఇక రానా అయితే తెలుగు, తమిళ్, హిందీ అన్న తేడా లేకుండా అన్ని ఇండస్ట్రీలలోనూ వరుసగా సినిమాలు చేస్తూ హంగామా చేస్తున్నాడు.
‘బాహుబలి’లో ఈ ముగ్గురు స్వరూపాలు చూసిన ప్రేక్షకులకు షాక్ ఇచ్చేలా ప్రస్తుతం వేరే క్యారెక్టర్స్ లో దూరిపోయారు. ఇటీవలే ఓ మ్యాగ్ జైన్ కు ప్రభాస్ ఇచ్చిన పిక్స్ స్టన్నింగ్ అనిపించేలా ఉండగా, అనుష్క ‘భాగమతి’ రోల్ లో మరోసారి జీవించేసినట్లు కనపడుతోంది. జుట్టు మొత్తం కత్తిరించుకుని ఉన్న రానా లేటెస్ట్ గెటప్ అయితే మరోసారి విమర్శకుల చేత ప్రశంసలు పొందేలా ఉన్నాడు. ఇలా ఈ ముగ్గురికి సంబంధించిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ నెటిజన్లను ఆకర్షిస్తోంది.





