‘విశాఖ ఉక్కు – ఆంధ్రుల హక్కు’ నినాదంతో జనసేన పార్టీ పోరాటం చేస్తోందని, ఇప్పటికే వివిధ రకాలైన నిరసనలను తెలియజేసిందని, పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఎంతో ధైర్యంగా, నిబద్ధతతో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని, కానీ అధికార వైసీపీ ప్రభుత్వం మాత్రం ఎలాంటి పోరాటం చేయడం లేదని జనసేన నేత పోతిన వెంకట మహేష్ విమర్శించారు.
బీజేపీ అంటే వైసీపీ ఎంపీలకు ఎందుకు అంత భయం, వణుకో సమాధానం చెప్పాలని, పార్లమెంట్ లో గానీ, రాజ్యసభలో గానీ కనీసం ప్ల కార్డులు కూడా ఎందుకు ప్రదర్శన చేయలేక పోతున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంపీ అంటే మీరు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనుకుంటున్నారేమో, ఎంపీ అంటే ఈ రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ముద్దపప్పులుగా భావిస్తున్నారు.
కనీసం ప్ల కార్డులు కూడా పట్టుకోలేని మిమ్మల్ని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని, బయటకు వచ్చి కేంద్ర ప్రభుత్వంపై నిరసన గళం వ్యక్తం చేయాలని డిమాండ్ చేస్తున్నట్లుగా మహేష్ చెప్పారు. రేపు పార్లమెంట్ సమావేశాలలో ప్ల కార్డులు పట్టుకోకపోతే ప్రజల దృష్టిలో దోషులుగా మిగిలిపోతారని, ఒకవేళ కేంద్రం ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేస్తే దానికి సంపూర్ణ బాధ్యత మీదేనని విమర్శల వర్షం కురిపించారు.
రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెడుతోంది జగన్ మోహన్ రెడ్డి గారేనని అన్న జనసేన నేతలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇచ్చిన డిజిటల్ కాంపెయిన్ ఓ పక్కన సోషల్ మీడియాలో రన్ అవుతుండగా, పోతిన వెంకట మహేష్ వంటి పార్టీ నేతలు హుషారుగా రోడ్లపైకి వచ్చి ప్ల కార్డులు పట్టుకుని నిరసన తెలియజేస్తున్నారు.
.@BJP4India ని చూస్తే @YSRCParty MP లకి ఎందుకంత భయం ముద్దపప్పు వైయస్సార్సీపి ఎంపీలు.
AP. MP లను మెంబర్ అఫ్ పార్లమెంట్ గా కాదు – ముద్ద పప్పు కు బ్రాండ్ అంబాసిడర్ గా చూస్తున్నారు. @VSReddy_MP @MithunReddyYSRC #Raise_Placards_YSRCP_MP#SaveVizagSteelPlant @JSPVijayaWest pic.twitter.com/PO6jMEdscL— Pothina venkata mahesh (@pvmaheshbza) December 19, 2021



