ప్రతీ రాష్ట్రంలో అనేక సాగునీటి ప్రాజెక్టులు… వాటి కోసం ఓ శాఖ, మంత్రి, వాటి పర్యవేక్షణకు వందలాది మంది అధికారులు, సిబ్బంది ఉంటారు. వాటిలో ఎక్కడో అక్కడ ఏవో సమస్యలు ఏర్పడుతూనే ఉంటాయి. వాటిని కాస్త ముందో వెనకో సరి చేస్తూనే ఉంటారు. ఇదొక నిరంతర ప్రక్రియ.
శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేసేందుకు నంద్యాల జిల్లాలోని పోతిరెడ్డిపాడు వద్ద గల హెడ్ రెగ్యులేటర్‌లో ఇటువంటి సమస్యే ఏర్పడింది. దీనిలో 3వ నంబర్ గేటు ఇనుప తాడు (వైర్ రోప్) చక్రాలు పగిలిపోగా, 9వ నంబర్ గేటు ఇనుప తాడు తెగిపోవడంతో గేటు కింద పడిపోయింది. కనుక దీనిపై వైసీపీ విమర్శలు భరించక తప్పదు.
ఈ ప్రాజెక్టులో ఇలాంటి మరమత్తుల కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.46 లక్షలు మంజూరు చేసింది. కానీ జలాశయంలో నిండుగా నీళ్ళున్నప్పుడు గేట్ల మరమత్తులు సాధ్యం కాదు. ప్రస్తుతం రోజుకు 8,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పుడు నీటిమట్టం తగ్గడంతో త్వరలో మరమత్తులు చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.
ప్రభుత్వ ప్రాధాన్యతలను బట్టి ఒక్కోసారి ప్రాజెక్టు నిర్మాణ పనులు, ఇలాంటి మరమత్తులు వేగంగా లేదా నత్త నడకన సాగుతూ ఉంటాయి. గత ప్రభుత్వ ప్రాధాన్యత సంక్షేమ పధకాలు. కనుక రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులకు కనీసం గేట్ల మరమత్తులు కూడా చేయించలేదు. వాటిలో పోతిరెడ్డిపాడు కూడా ఒకటి.
కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సాగునీటి ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. వాటిలో పోతిరెడ్డిపాడు గేట్ల మరమత్తులతో సహా అనేకం ఉన్నాయి.
ధవళేశ్వరానికి కొత్త గేట్లు ఏర్పాటు చేయిస్తోంది. పోలవరం పనులు పరుగులు పెట్టిస్తోంది. వెలిగొండ మొదటి దశ పనులు పూర్తిచేసి నీళ్ళు విడుదల చేస్తోంది. పోలవరం ఎడమ కాలువ నుంచి ఉత్తరాంధ్రా జిల్లాలకు నీటిని విడుదల చేస్తోంది.
లోయర్ సీలేరు కొత్తగా ఒక్కోటి 115 మెగావాట్ల సామర్థ్యం కలిగిన 2 యూనిట్లు నిర్మిస్తోంది. ఎగువ సీలేరు వద్ద 1,350 మెగావాట్ల భారీ పంప్డ్ స్టోరేజ్ సామర్ధ్యం కలిగిన మరో కొత్త ప్రాజెక్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి.
ఒక్క సాగునీటి రంగంలో జరుగుతున్న ఇలాంటి నిర్మాణ, మరమత్తుల పనుల జాబితా చాలా పెద్దదే ఉంది. అయినా వైసీపీ విమర్శలు, సాగునీరు పేరుతో చేస్తున్న రాజకీయాలు, క్రెడిట్ చోరీ సొల్లు కబుర్లు భరించక తప్పడం లేదు.
వెలిగొండ ప్రాజెక్ట్ తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో the best video..👇
ప్రస్తుతం శ్రీశైలం నుంచి టన్నెల్ ద్వారా వస్తున్న నీళ్ళు ఎక్కడికి వెళ్తున్నాయి..
అసలు ఏ ఏ గ్రామాలు మునిగిపోతాయి అని చాలా క్లియర్ గా ఉంటుంది..
don't miss this video pic.twitter.com/D1OlODw0U5
— ఆంధ్రుడు (@Gogineni_Pa1onX) September 9, 2026





