పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబోపై ఇంటరెస్టింగ్ న్యూస్!

pawan-kalyan-trivikramపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంభినేషన్ కున్న క్రేజ్ తెలియనిది కాదు. ‘జల్సా, అత్తారింటికి దారేది’ సినిమాల ద్వారా రెండు సార్లు బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఘనత వీరిద్దరిది. అయితే ముచ్చటగా మూడోసారి మళ్ళీ జత కట్టబోతున్న పవన్ – త్రివిక్రమ్ ల మూవీకి సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ వర్క్ శరవేగంగా జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా దర్శకుడు త్రివిక్రమ్ ఈ సినిమా బాధ్యతలను తన భుజానపై వేసుకున్నట్లుగా ట్రేడ్ వర్గాల టాక్.

ADVERTISEMENT

పవన్ కళ్యాణ్ ప్రస్తుతం అజిత్ ‘వీరమ్’ రీమేక్ లో నటిస్తుండగా, ఈ సినిమా షూటింగ్ ను ఎట్టి పరిస్థితుల్లో జనవరి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు. అలాగే ఈ సినిమా పూర్తయిన వెంటనే ఎలాంటి విశ్రాంతి తీసుకోకుండా త్రివిక్రమ్ సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్ళాలని భావిస్తున్నట్లుగా సమాచారం. దీంతో ఈ మూడు నెలల కాలంలో ఈ సినిమాకు సంబంధించిన అన్ని పనులను త్రివిక్రమ్ తీసుకున్నట్లుగా సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.

విదేశాలలో షూటింగ్ ప్రదేశాలను ఎంపిక చేయడానికి త్వరలోనే తన టీంతో కలిసి త్రివిక్రమ్ పయనమవనున్నాడని తెలుస్తోంది. అయితే ఈ మూడు నెలల సమయంలో త్రివిక్రమ్ కు ఓ భారీ ఆఫర్ కూడా వచ్చినట్లు తెలుస్తోంది. ఓ చిన్న బడ్జెట్ లో సినిమా చేయడానికి ఈ మాటల మాంత్రికుడికి దాదాపు 10 కోట్ల రూపాయల పారితోషిక ఆఫర్ వచ్చిందని, అయినప్పటికీ త్రివిక్రమ్ దానిని అందిపుచ్చుకోలేదని, తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కోసం ఆ భారీ ఆఫర్ ను వదులుకున్నాడని టాక్.

త్వరలో పవన్ కళ్యాణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లోకి రానున్న నేపధ్యంలో… దానికి ముందు ఒక భారీ హిట్ ను తన స్నేహితుడికి కానుకగా ఇవ్వడం ద్వారా అభిమానులకు, ప్రేక్షకులకు మాంచి ఊపును ఇవ్వాలని త్రివిక్రమ్ గట్టిగా ఫిక్స్ అయ్యి ఉన్నారట. దీంతో ప్రస్తుతం పవన్ సినిమా పనులు మినహా మరే ఇతర కార్యక్రమాలు పెట్టుకోవడం లేదని, కోట్ల రూపాయలను పక్కనపెట్టి, స్నేహానికి త్రివిక్రమ్ ఇస్తున్న విలువ నిజంగా అభినందనీయమని… సినీ జనాలు ఈ ‘మాటల మాంత్రికుడి’పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ADVERTISEMENT
Latest Stories