శర్వానంద్ తాజా చిత్రంగా ‘మహానుభావుడు’ తెరకెక్కింది. మారుతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటించింది. ఈ సినిమాను ఈ నెల 29వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఆడియో రిలీజ్ ఫంక్షన్ జరపడానికి నిర్మాతలు రంగాన్ని సిద్ధం చేస్తున్నారు. ఆడియో వేడుకకు ముఖ్య అతిథిగా ప్రభాస్ ను ఆహ్వానించారని సమాచారం.
ADVERTISEMENT
ఈ సినిమాను నిర్మించిన యూవీ క్రియేషన్స్ వారితో ప్రభాస్ కి ఎంతో సాన్నిహిత్యం వుంది. అందువలన ప్రభాస్ ఈ వేడుకకి హాజరు కావడం ఖాయమేనని చెప్పొచ్చు. ఈ సినిమా ఆడియో రిలీజ్ ఎప్పుడు? .. ఎక్కడ? అనే వివరాలను త్వరలోనే తెలియజేయనున్నారు. ఎన్టీఆర్… మహేశ్ బాబు సినిమాలతో పోటీపడుతోన్న శర్వానంద్ తరపున పబ్లిసిటీ కోసం ప్రభాస్ ను బరిలోకి దిగుతున్నాడన్న మాట.
ADVERTISEMENT


