యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ తో తొలిసారిగా జతకడుతుంది వాలుకళ్ళ వయ్యారి పూజా హెగ్డే. ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించింది ఈ పొడుగు కాళ్ళ సుందరి. రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం గురించి పూజా ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇప్పటివరకు రెండు షెడ్యూల్స్ పూర్తి అయ్యాయి. మిగతా చిత్రీకరణకోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నా. ఇప్పటివరకు తెలుగు తెర మీద రాని అంశాలను వెండితెరపైకి తీసుకురాబోతున్నాం. యూరోపియన్ పీరియడ్ చిత్రంగా రూపొందుతుంది’ అని తెలిపారు.
ఈ చిత్రం హీరో ప్రభాస్ గురించి ఆమె పొగడ్తలతో ముంచెత్తింది.. ” ఆయన చాలా స్వీట్ పర్సన్. అంతటి మంచి మనిషిని ఇప్పటివరకు నేనైతే ఎప్పుడూ చూడలేదు. అంత గొప్ప స్టార్ అయివుండి కూడా ఎంతో మర్యాదగా, పద్ధతిగా ఉండటం చాలా గొప్ప విషయం” అని ఆమె చెప్పుకొచ్చింది. ఈ చిత్రానికి ‘అమూర్’ అనే ఫ్రెంచ్ టైటిల్‌ని అనుకుంటున్నట్లు చిత్రవర్గాల భోగట్టా. ప్రభాస్ సాహో చిత్రం ఆగష్టు 15న విడుదల కాబోతుంది. ఈ ఏడాది చివరిలో ఈ చిత్రం విడుదల అయ్యే అవకాశం ఉంది
పూజా మరోపక్క బాలీవుడ్‌లో ‘హౌస్‌ఫుల్ 4’ చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగు చాలా వరకూ పూర్తి అయ్యింది. త్రివిక్రమ్ శ్రీనివాస్, అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వస్తున్న ఓ చిత్రంలోనూ కథానాయికగా నటించే అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ఈ నెల 24 నుండి సెట్స్ మీదకు వెళ్తుంది. మరోవైపు సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఆమె నటించిన మహర్షి చిత్రం వచ్చే నెల 9న వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.



