చంద్రబాబు స్కూల్ మీద కేంద్రమంత్రి ఆకస్మిక పర్యటన… ఆశ్చర్యపోయారు…

prakash-javadekar-visited-chandrababu-naidu-studied-schoolకేంద్రమంత్రి ప్రకాష్ జవదేకర్ చిత్తూరు జిల్లా పర్యటనలో ఒక ఆసక్తికరమైన ఘటన జరిగింది. తిరుపతి లో స్వామి వారి దర్శనం అనంతరం ఆయన అక్కడ దగ్గర్లో ఉన్న టంగుటూరి ప్రకాశం పంతులు నగర పాలక ఉన్నత పాఠశాలలో ఆకస్మిక తనిఖీ చేసారు. ముఖ్యమంత్రి చదువుకున్న పాఠశాల దుస్థితి చూద్దాం అంటూ మీడియాను తీసుకెళ్లారు. అయితే ఆయనకు బడిలో డిజిటల్ తరగతులు స్వాగతం పలికాయి. ఏదో ఒక తప్పు పట్టుకోవాలని బడి పిల్లల రిజిస్టర్ పరిశీలించారు ఆయన.

ADVERTISEMENT

[m9ad]

హాజరు కూడా ఎక్కువగా ఉండడంతో అవాక్కయ్యారు. డిజిటల్ తరగతులలో పిల్లలకు అందుతున్న విద్యాబోధన చూసి ఆశ్చర్యపోయారు. అక్కడితో ఆగకుండా కొంత మంది పిల్లలను ప్రశ్నలు అడిగారు. వారు కరెక్టు సమాధానాలు చెప్పడంతో ఏమీ చేయలేకపోయారు. విశాలమైన తరగతి గదులు, గ్రంధాలయం, మధ్యాహ్న భోజన పథకం అమలు చెయ్యడంతో హాజరు బావుందని టీచర్లు మంత్రికి వివరించారు. దీనితో చేసేది ఏమీ లేక విద్యావ్యవస్థ మెరుగు కోసం కేంద్రం చేపడుతున్న చర్యలను ఏకరవు పెట్టారు మంత్రి.

ఏదో వంక పెట్టాలి కాబట్టి మీడియాతో మాట్లాడుతూ 6 నుండి 10 తరగతులలో కేవలం 150 విద్యార్థులు మాత్రమే ఉన్నారని ఆయన మీడియాతో చెప్పారు. దీనితో చంద్రబాబు పాలన అంటే అలా ఉంటుందని అక్కడ ఉన్నవాళ్ళంతా చెప్పుకున్నారు. ఆకస్మిక పర్యటన పూర్తి చేసుకున్న మంత్రి మోహంలో నెత్తుటి చుక్క లేదు అని అక్కడి వారంతా ఎద్దేవా చెప్పారు. తప్పు ఎత్తి చూపడానికి వచ్చిన మంత్రి చేతే శెభాష్ అనిపించుకోవడం మాములు విషయం కాదని వారు అన్నారు.

ADVERTISEMENT
Latest Stories