పీకే : చేతులు కాల్చుకున్నారు..ఆకులు పట్టుకోగలరా.?

Prashant Kishor’s Jan Suraaj Party failing in Bihar elections

ప్రశాంత్ కిషోర్ భారతదేశ పొలిటికల్ సర్కిల్స్ లో బాగా ప్రాచుర్యం పొందిన పేరు. ఆయన దేశంలో అనేక రాజకీయ పార్టీలకు ముఖ్య రాజకీయ సలహాదారుగా వ్యవహరించి ఆయా పార్టీల గెలుపులో ప్రముఖ పాత్ర వహించారు, అలాగే ఆయా ప్రభుత్వాల పాలనలో పరోక్షంగా భాగమయ్యారు.

అయితే ఇదంతా గత చరిత్ర, పొలిటికల్ స్టాటజీస్ట్ గా ఇంతటి ప్రాధాన్యత, గౌరవ మర్యాదలు అందుకున్న ప్రశాంత్ కిషోర్ ‘జన్ సూరజ్ పార్టీ’ తో బీహార్ లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పుడు దాని తాలూకా వచ్చిన ఫలితంతో తన పొలిటికల్ స్ట్రాటజిస్ట్ పేరు ప్రఖ్యాతలను బూడిదలో పోసిన పన్నీరు మాదిరి వృధా చేసుకున్నారు.

ADVERTISEMENT

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సమరంలో తన పార్టీ తరుపున 239 మంది అభ్యర్థులను నిలబెట్టిన ప్రశాంత్ తన పొలిటికల్ స్ట్రాటజిలతో కనీసం ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయారు. అలాగే చివరికి jsp పార్టీ అధినేతగా ఎన్నికల పోరులో తానూ పోటీ చేయడానికి కూడా సాహసించలేకపోయారు.

అలాగే తన పార్టీ తరుపున పోటీ చేసిన 239 మందిలో ఏఒక్కరు కూడా కనీసం డిపాజిట్లు కూడా రాబట్టుకోలేకపోవడం, బీహార్ మొత్తంలో jsp పార్టీ కేవలం 2% ఓటు షేర్ ను మాత్రమే సాధించడం ప్రశాంత్ ఫెయిల్యూర్ ని సూచిస్తుంది. దీనితో ఒకప్పుడు బీజేపీ గెలుపులో, వైసీపీ ఘన విజయంలో తానూ పోషించిన కీలక పాత్ర ఇప్పుడు చిన్నబోయినట్టయ్యింది.

పొలిటికల్ స్ట్రాటజిస్ట్ నుంచి పొలిటికల్ నాయకుడిగా ఎదగాలి అన్న ఆయన అత్యాశ చివరికి ప్రశాంత్ కోశోర్ ని పొలిటికల్ స్ట్రాటజిస్ట్ హోదా నుంచి కూడా పుర్తిగా తొలగించినట్లయ్యింది. తన సొంత పార్టీనే ఎన్నికలలో గెలిపించుకోలేని స్ట్రాటజిస్ట్ ఇక ఇతర పార్టీల గెలుపు కోసం ఎటువంటి ప్రణాళికలు వేయగలరు.?ఎటువంటి వ్యూహాలు రచించగలరు.? అంటూ పీకే పై పెద్ద ఎత్తున విమర్శనాబాణాలు పడబోతున్నాయి.

కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టయ్యింది పీకే పరిస్థితి అంటూ సోషల్ మీడియాలో ఇప్పటికే జన్ సూరజ్ పార్టీ పై, పీకే పై మీమ్స్, కౌంటర్స్ సిద్ధమయ్యాయి. మరి పొలిటికల్ ఎంట్రీ తో చేతులు కాల్చుకున్న పీకే ఇప్పటికైనా ఆకులు పట్టుకోగలరా.? లేదా అన్నది వేచి చూడాలి.

ADVERTISEMENT
Latest Stories