మొన్న కనుసైగతో….ఇప్పుడు తుపాకీ ముద్దుతో…

Priya Prakash Varrier‘ఒరు అదర్ లవ్’ మలయాళం చిత్రంలోని ‘మాణిక్య మలరాయ పూవీ’ అంటూ కను సైగలతో యావత్ యువత గుండెలను పిండేసిన మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్ ఓవర్ నైట్ లో ఎంత పాపులర్ అయ్యిందో మనకి తెలిసిందే. మొదట టీజర్ తో ఆ సినిమాకి కూడా మంచి హైప్ క్రియేట్ అయ్యింది.

ఇప్పుడు ఆ చిత్రం నుండి ఇంకొక టీజర్ వదిలారు. మొన్న కనుబొమ్మలతో కేక పుట్టించిన ప్రియ ప్రకాష్ వారియర్ రెండో టీజర్ లో తుపాకీ ముద్దు తో యువత గుండెను పిండేస్తుంది. ఈ టీజర్లో ప్రియ తన పెదాలపై ముద్దును రెండు వేళ్లతో తీసుకుని, తుపాకీలా హీరో గుండెలను పేల్చుతుంది. యూట్యూబ్ లో మంచి వ్యూస్ వస్తున్న ఈ రెండో టీజర్ అప్పుడే 3 మిలియన్ వ్యూస్ కొట్టేసింది.

ADVERTISEMENT

మొదటి చిత్రం రిలీజ్ అవ్వకుండానే జస్ట్ రెండు లుక్ లతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ మలయాళ భామ ఇంకా ఎన్ని హావభావాలతో కుర్రాళ్ల గుండెలను మెలి పెట్టేస్తుందో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories