దరిద్రుడు ఆదరా బాదరాగా…పని మీద వెళితే, పక్కనే పడి ఉన్న తాడే పామై కరిచిందట. పాపం ఇప్పుడు టాలీవుడ్ లో ఒక టాప్ హీరో పరిస్థితి ఎలా ఉంది. చాలా గ్యాప్ తర్వాత, అనేక రూమర్స్ ను తట్టుకుని మరీ మళ్లీ ఎంట్రీ ఇచ్చాడు మన మాస్ మహారాజ ‘రవి తేజ’. అయితే యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాజా ద గ్రేట్” సినిమా మంచి హిట్ గా నిలిచి ‘రవి ఈజ్ బ్యాక్’ అనేలా చేసింది. కానీ టైమ్ అక్కడితో ఆగిపోతే బావుండేది. అసలు బ్యాడ్ టైమ్ అక్కడే మొదలయ్యింది మన మాస్ మహారాజాకి, వరుస సినిమాలు చేస్తున్నాడు అన్న ఆనందం తప్ప మిగిలింది ఏమీ లేకుండా పోయింది ఆయన ఫాన్స్ కి. వరుసగా ఆయన చేసిన “టచ్ చేసి చూడు”, “నేల టికెట్”, తాజాగా వచ్చిన “అమర్-అక్బర్-అంథోనీ” సైతం భారీ డిజస్టర్స్ నిలిచాయి. అయితే మిరపాకాయ్, రేసు గుర్రం లాంటి సినిమాలకు స్క్రిప్ట్ రైటర్ గా పని చేసిన విక్రమ్ సిరికొండ కానీ, యువ దర్శకుడు కల్యాణ్ కృష్ణ కానీ, చివరకు రవి తేజతో మ్యాజిక్ చేసిన శ్రీను వైట్ల కానీ రవికి హిట్ ఇవ్వలేకపోయారు.
[m9ad]
కట్ చేస్తే రవి నెక్స్ట్ సినిమాకు ప్రొడ్యూసర్ అయితే దొరికాడు కానీ, సవా లక్ష కండీషన్స్ పెట్టాడట. ఇంతకీ రవి తన నెక్స్ట్ సినిమా ఎవరితో తీస్తున్నాడు? ఏ బ్యానర్ లో తీస్తున్నాడు అని వివరాల్లోకి కాస్త క్లుప్తంగా వెళితే ఎస్.ఆర్.టీ ఎంటర్‌టేన్‌మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్ళూరి నిర్మాణంలో చిన్న చిత్రాల చిచ్చర పిడుగు వీఐ ఆనంద్ దర్శకత్వంలో నటించనున్నాడట. అయితే ఇప్పటికే ‘ఎక్కడికి పోతావు చిన్నవాడ’, ‘ఒక్క క్షణం’ సినిమాతో మంచి కాంటెంట్ ఉన్న దర్శకుడుగా నిలిచిన డైరెక్టర్ కావడంతో రవితేజ ఈ డైరెక్టర్ కి అవకాశం ఇచ్చినట్లు సమాచారం.
ఇక మరో పక్క ఈ సినిమా విషయంలో నిర్మాత దర్శకుడితో బడ్జెట్ విషయంలో ఆచి తూచి వ్యవహరించమని చెప్పినట్లుగా తెలుస్తుంది. అసలే వరుస ఫ్లాప్స్ తో బ్యాడ్ టైమ్ నడుస్తున్న హీరో, ఖర్చు విషయంలో కాస్త తగ్గి ఉండండి, లేదంటే ఆరిపోతాం అన్నట్లుగా ఉంది పాపం సదరు నిర్మాత పరిస్థితి. ఏం చేస్తాం పాపం అలా ఉంది రవి పరిస్థితి. అయితే ఇవన్నీ ప్రతీ హీరోకి సర్వ సాధారణమే, కాకపోతే వరుసగా రెండు మూడు హిట్స్ పడితే మళ్లీ ఈ నిర్మాతలే ఆయన డేట్స్ కోసం ఎగబడుతూ, సినిమాని ప్రతిష్టాత్మకంగా నిర్మించి సగర్వంగా రిలీజ్ చేస్తున్నాం అంటూ చెబుతారు. చూద్దాం మరి ఈ సినిమా అయినా మన మాస్ మహా రాజాకి టర్నింగ్ పాయింది గా నిలుస్తుందేమో.



