మరికొద్ది గంటల్లో ప్రారంభం కావాల్సిన భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డేపై నీలినీడలు కమ్ముకొన్నాయి. ఈ రోజు మ్యాచ్ జరగడంపై అనుమానాలు నెలకొన్నాయి. పూణెలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్(ఎమ్‌సీఏ) మైదానం వేదికగా నేటి మధ్నాహం 1.30గంటలకు భారత్-న్యూజిలాండ్ మధ్య రెండో వన్డే ప్రారంభంకావాల్సి ఉంది.
ఇందుకోసం ఏర్పాట్లు అన్ని పూర్తయ్యాయి. ఐతే ఒక టీవీ చ్యానెల్ స్టింగ్ ఆపరేషన్ లో షాకింగ్ న్యూస్ బయటకి వచ్చింది. పిచ్ క్యూరేటర్ పాండురంగ్ సాల్‌గావ్కర్ బుకీలతో చేతులు కలిపి పిచ్‌కు సంబంధించిన రిపోర్టు మొత్తం వారి చేతుల్లో పెట్టాడు. అంతేకాదు బుకీలు చెప్పినట్లే పిచ్‌ను పర్యాటక జట్టు ఫాస్ట్ బౌలర్లకు అనుకూలించేలా తయారు చేసినట్లు స్పష్టంగా తేలింది
.
బీసీసీఐ, ఎమ్‌సీఏ ప్రతినిధులు క్యూరేటర్ పాండురంగ్‌ను వెంటనే సస్పెండ్ చేశారు. దీంతో ఇప్పుడు మ్యాచ్ జరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మ్యాచ్ నిర్వహించడంపై తుది నిర్ణయం మ్యాచ్ రెఫరీ దే. దీనితో భారత క్రికెట్ లోకి మరోసారి మ్యాచ్ ఫిక్సింగ్ భూతం వచ్చిపడింది.


