పునీత్ రాజ్ కుమార్.. టాలీవుడ్ తో పెనవేసుకున్న అనుబంధం !

Puneeth Rajkumar good  Affiliation with Tollywoodశాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఇక లేరు. గుండెపోటుతో ఆయన హాస్పిటల్ లో మరణించారు. దీంతో కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు తెలుగు చిత్ర పరిశ్రమలో కూడా ఒక తీవ్ర విచారం నెలకొంది. నిజానికి పునీత్ కన్నడ హీరో అయినప్పటికీ ఆయన తండ్రి రాజ్ కుమార్ తో తెలుగు సీనియర్ హీరోలకు మంచి అనుబంధం ఉంది. ఎన్టీఆర్, ఏఎన్నార్ పాటు మిగతా వారితో సీనియర్ హీరోలతో కూడా ఆ కుటుంబానికి మంచి రిలేషన్ ఉంది.

ఇక పునీత్ ని హీరోగా లాంచ్ చేసింది కూడా మన తెలుగు దర్శకుడు పూరి జగన్నాథె. అప్పు అనే సినిమాతో పూరి పునీత్ ని హీరోగా మార్చి పెద్ద హిట్ ఇచ్చాడు. ఇక పునీత్ కుటుంబంతో బాలయ్య , ఎన్టీఆర్, చిరంజీవి కి మంచి అనుబంధం ఉంది. నందమూరి కుటుంబంతో ఉన్న బంధంతోనే బాలయ్య ‘గౌతమీ పుత్రశాతకర్ణి’ లో నటించాడు శివ రాజ్ కుమార్.

ADVERTISEMENT

ఇక పునీత్ హీరోగా నటించిన ‘చక్రవ్యూహ’ సినిమాలో ఎన్టీఆర్ ఒక పాట కూడా పాడాడు. ఇక టాలీవుడ్ నుండి సినిమా ప్రమోషన్ కోసం ఎవరు బెంగుళూరుకి వెళ్లిన ఈవెంట్ కి గెస్ట్ వచ్చి ప్రమోషన్ చేసిపెడతాడు పునీత్. ఆ బాండింగ్ తోనే ఇప్పుడు పునీత్ మరణ వార్త విని టాలీవుడ్ షాక్ కి గురైంది.

ఇప్పటికే టాలీవుడ్ స్టార్ హీరోలంతా పునీత్ మరణ వార్తని జీర్ణించుకోలేక సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు జరగాల్సిన వరుడు కావలెను సక్సెస్ సెలెబ్రేషన్స్ ని కూడా పోస్ట్ పోన్ చేసుకున్నారు. అలాగే RRR టీజర్ కి సంబంధించి ఈరోజు అప్ డేట్ ఉంటుందని ముంబై మీడియాతో చెప్పాడట రాజమౌళి. అది కూడా వాయిదా వేసుకున్నట్లు సమాచారం. ఏదేమైనా పునీత్ కి టాలీవుడ్ తో ఉన్న అనుబంధాన్ని ఇప్పుడు అందరూ హీరోలు నెమరు వేసుకుంటున్నారు.

ADVERTISEMENT
Latest Stories