కన్నడ అభిమానులు ముద్దుగా పిలుచుకునే పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గురువారం నాడు సాయంత్రం ఓ ప్రమాదం నుండి బయటపడ్డారు. “నటసార్వభౌమ” సినిమా షూటింగ్ ముగించుకుని బళ్ళారి నుండి బెంగుళూరుకు బయలుదేరిన పవర్ స్టార్ కారు ప్రమాదానికి గురయ్యింది. అనంతపురం వద్ద టైరు పంక్చర్ కావడంతో, కారు అదుపుతప్పింది.
Also Read – కర్నూలు హైకోర్టు బెంచ్‌కి తొలి విగ్నం.. వాళ్ళేనా?
అయితే అదృష్టవశాత్తు ఎలాంటి ప్రమాదం చోటు చేసుకోకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంలో అభిమానులు ఆందోళన చెందాల్సిన పనిలేదని, పునీత్ సురక్షితంగా ఉన్నారని అధికారిక సమాచారం వెలువడింది. యాక్సిడెంట్ కు గురైన సదరు కారు (రేంజ్ రోవర్) ఫోటోలు మాత్రం నెట్టింట సందడి చేస్తున్నాయి. ఎంత ఖరీదైన కార్లైనా గానీ పంక్చర్లు పడకుండా ఉంటాయా?!
#Kannada hero #PuneethRajkumar's car met with accident at ananthapur. The driver and the hero are safe pic.twitter.com/z4XKaaBahK
— Y. J. Rambabu (@yjrambabu) June 7, 2018