Raghu Rama Krishna Rajuఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో నిందితుడుగా ఉన్న శరత్‌ చంద్రా రెడ్డి రాత్రికి రాత్రి అప్రూవరుగా మారలేదని, దీని కోసం దాదాపు నెలరోజులుగా ఢిల్లీ పెద్దలతో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి చర్చించిస్తున్నారని ఓ ప్రముఖ తెలుగు మీడియా బయటపెట్టింది. విజయసాయి రెడ్డి అల్లుడి అన్నే శరత్‌ చంద్రా రెడ్డి. కనుక ఆయనను ఈ కేసులో నుంచి బయటపడేసేందుకు విజయసాయి రెడ్డి ప్రయత్నించడం సహజమే.

అయితే ఇందుకు బదులుగా ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో సహా కొందరి పేర్లు బయటపెట్టేందుకు, అదే సమయంలో వివేకానందరెడ్డి హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డిని ఆ కేసులో నుంచి బయటపడేసేందుకు ఒప్పందం జరిగి ఉండవచ్చని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు అభిప్రాయం వ్యక్తం చేసారు.

Also Read – వైసీపీ నేతల కేసులు.. ఎక్స్‌ఎల్ షీట్ పెట్టాలేమో?

సిఎం జగన్మోహన్ రెడ్డి తాజా పర్యటనలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాను కలిసిన తర్వాత ఈ డీల్ ఖాయం అయ్యి ఉండవచ్చని అన్నారు. తద్వారా జగన్మోహన్ రెడ్డి తాను ముఖ్యమంత్రి కావడానికి ఎంతగానో తోడ్పడిన తెలంగాణ సిఎం కేసీఆర్‌ను మోసం చేశారని రఘురామకృష్ణ రాజు అభిప్రాయం వ్యక్తం చేసారు.

ఈ ఏడాది చివరిలోగా తెలంగాణ శాసనసభ ఎన్నికలు జరుగబోతున్నాయి. ఎట్టి పరిస్థితులలో ఆ ఎన్నికలలో గెలిచి అధికారంలోకి రావాలని బిజెపి అధిష్టానం చాలా పట్టుదలగా ఉంది. కానీ తెలంగాణలో తిరుగులేని రాజకీయశక్తిగా నిలుస్తున్న కేసీఆర్‌ను, తెలంగాణలో పోటీ చేసేందుకు తగినంత మంది అభ్యర్ధులు కూడా లేని బిజెపి ఓడించలేదు. కనుక తెలంగాణ బిజెపి నేతల సూచన ప్రకారం ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవితను అరెస్ట్‌ చేసి బిఆర్ఎస్ నేతల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలని బిజెపి భావిస్తే విచిత్రం, ఆశ్చర్యం కాదు.

Also Read – వాఘా మూసేసి సరిహద్దులు తెరుస్తామంటున్న పాక్ పాలకులు!

కనుక వివేకా హత్య కేసుని పణంగా పెట్టి లిక్కర్ స్కామ్‌ కేసుతో తెలంగాణలో బిజెపి పైచేయి సాధించాలని ప్రయత్నిస్తున్నట్లు రఘురామకృష్ణ రాజు అనుమానం వ్యక్తం చేసారు. రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తే ఆయన అనుమానాలు నిజమే అనిపిస్తుంది.

కేసీఆర్‌ కూడా ఎట్టి పరిస్థితులలో తన అధికారం కాపాడుకోవడం చాలా అవసరం. లేకుంటే తన కుటుంబం, పార్టీ కోలుకోలేనంతగా నష్టపోతుంది. కనుక ఒకవేళ కల్వకుంట్ల కవితని అరెస్ట్‌ చేస్తే ఆయన మరింత ధీటుగా బిజెపిని ఎదుర్కొనే ప్రయత్నం చేస్తారు. తన జాతీయ రాజకీయ ప్రయత్నాలకు మరింత పదును పెట్టి వేగవంతం చేస్తారు. అవసరమతే కాంగ్రెస్‌ కూటమితో చేతులు కలిపేందుకు కూడా వెనకాడకపోవచ్చు.

Also Read – నారాయణ.. శల్యసారధ్యం చేస్తున్నారా?

కానీ చివరిగా ఒక్క మాట చెప్పుకోవలసి ఉంది. శరత్ చంద్రా రెడ్డి కారణంగా తన కూతురు జైలుకి వెళ్ళిన్నట్లయితే కేసీఆర్‌ ఏవిదంగా స్పందిస్తారు?జగన్మోహన్ రెడ్డితో, వైసీపీలతో ఏవిదంగా వ్యవహరిస్తారు? అనేది చాలా ఆసక్తికరమైన విషయమే.