వైసీపికి ఓ గుడ్ న్యూస్! ఓ బ్యాడ్ న్యూస్!

YSRCP Media

వైసీపి అధినేత జగన్మోహన్‌ రెడ్డికిఓ గుడ్ న్యూస్! ఓ బ్యాడ్ న్యూస్! గుడ్ న్యూస్ ఏమిటంటే ఆయనకు పక్కలో బల్లెంలా మారిన ఆ పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఢిల్లీలో ప్రకటించారు!

జగన్‌తో విభేధించినందుకు రఘురామ పాదాలు వాచిపోయాయి. ఆయనకు ఆ నొప్పులు కొన్ని రోజులలోనే తగ్గిపోయాయి. కానీ ఆనాటి నుంచే ఆయన జగన్‌ ప్రభుత్వంపై గత నాలుగేళ్ళుగా ప్రతీరోజూ ప్రతీకారం తీర్చుకుంటూనే ఉన్నారు. కనుక ఆయన పార్టీకి రాజీనామా చేయడంతో జగన్‌కు ఆయన నుంచి విముక్తి లభించింది కనుక ఇది ఖచ్చితంగా వైసీపీకి గుడ్ న్యూస్.

ADVERTISEMENT

ఇక జగన్ ఎంత వద్దనుకున్నా టిడిపి, జనసేనలు సీట్ల సర్దుబాట్లు చేసుకోవడం ఓ బ్యాడ్ న్యూస్! ఈరోజు మధ్యాహ్నం టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యి పార్టీ అభ్యర్ధులను ప్రకటించబోతున్నట్లు సమాచారం. బహుశః అందుకే రఘురామ కృష్ణరాజు హటాత్తుగా ఇప్పుడు పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఉండవచ్చు.

టిడిపి తొలి జాబితాలో సుమారు 60 మందికి పైగా అభ్యర్ధులను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలి జాబితాలో అందరూ ఊహించగల కొన్ని పేర్లు ఇవే…

1. చంద్రబాబు నాయుడు: కుప్పం; అచ్చన్నాయుడు: టెక్కలి; నారా లోకేష్: మంగళగిరి; బాలకృష్ణ: హిందూపురం;

2. చింతకాయల అయ్యన్నపాత్రుడు: నర్సీపట్నం; నిమ్మల రామానాయుడు: పాలకొల్లు; పయ్యావుల కేశవ్‌: ఉరవకొండ;

3. గద్దె రామ్మోహన్: విజయవాడ ఈస్ట్‌; జ్యోతుల నెహ్రూ: జగ్గంపేట;

4. గోరంట్ల బుచ్చయ్యచౌదరి: రాజమండ్రి రూరల్‌; ఆదిరెడ్డి భవాని: రాజమండ్రి సిటీ; జోగేశ్వరరావు: మండపేట; చినరాజప్ప: పెద్దాపురం;

5. చింతమనేని ప్రభాకర్: దెందులూరు; మంతెన రామరాజు: ఉండి;

6. కన్నా లక్ష్మీనారాయణ: సత్తెనపల్లి; చిలకలూరిపేట: ప్రత్తిపాటి పుల్లారావు; గొట్టిపాటి రవికుమార్: అద్దంకి; బాల వీరాంజనేయులు: కొండపి;

7. పితాని సత్యనారాయణ: ఆచంట; ఆరుమిల్లి రాధాకృష్ణ: తణుకు; నల్లమిల్లి రాధాకృష్ణారెడ్డి: అనపర్తి, నరేంద్రవర్మ: బాపట్ల, నక్క ఆనందబాబు: వేమూరు; ధూళ్లిపాళ నరేంద్ర: పొన్నూరు; రామాంజనేయులు: ప్రత్తిపాడు; కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి: నెల్లూరు రూరల్‌; నారాయణ: నెల్లూరు సిటీ;

8. పీలా గోవింద సత్యనారాయణ: అనకాపల్లి; వంగలపూడి అనిత: పాయకరావుపేట;

9. వెలగపూడి రామకృష్ణబాబు: విశాఖపట్నం ఈస్ట్‌; గణబాబు: విశాఖ పట్నం వెస్ట్‌; పల్లా శ్రీనివాసరావు: గాజువాక;

10. సియ్యారి దన్ను దొర: అరకు; తోయక జగదీశ్వరి: కురుపాం; విజయచంద్ర: పార్వతీపురం; గుమ్మడి సంధ్యారాణి: సాలూరు.

11. రంగారావు (బేబి నాయన): బొబ్బిలి; కొండపల్లి శ్రీనివాస్: గజపతి నగరం; కొండ్రు మురళి: రాజాం;

12. కూన రవికుమార్: ఆమదాలవలస; బెందాళం అశోక్: ఇచ్ఛాపురం.

ADVERTISEMENT
Latest Stories