జగన్ ఈ గొప్ప అవకాశం వినియోగించుకోవాలి

Ragurama Krishna Raju ys jagan presential electionsవైసీపీ ఎంపీ రఘురామకృష్ణ రాజు తమ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చెపుతున్న సలహాలు చక్కగా ఉంటాయి కానీ వాటిని ఆచరించలేరు కనుక ఇబ్బందిగా ఉంటుంది. త్వరలో జరుగబోయే రాష్ట్రపతి ఎన్నికలలో మోడీ ప్రభుత్వానికి వైసీపీ మద్దతు చాలా కీలకమని కనుక ఈ గొప్ప అవకాశాన్ని వినియోగించుకొని ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని షరతు విధించాలని రఘురామ సూచించారు.

ఒకవిదంగా ఇది చక్కటి సలహాయే. ఎందుకంటే, వైసీపీ మద్దతు ఇస్తే ఎన్డీయే అభ్యర్ధికి మరే పార్టీ మద్దతు అవసరమే ఉండదు. అవలీలగా ఎన్నికవవచ్చు. కానీ వైసీపీ ప్రభుత్వానికి ప్రత్యేకహోదా సాధించాలనే తాపత్రయమూ లేదు అలా పట్టుబట్టే ధైర్యమూ లేదు. కనుక రఘురామ సలహా కాస్త ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ వినబడనట్లు ఊరుకోక తప్పదు.

ADVERTISEMENT

జగన్ ప్రతిపక్షంలో ఉన్నంత కాలం రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని లేకుంటే మన పిల్లలు అన్యాయం అయిపోతారని, వారికి ఉద్యోగాలు లభించవని దాంతో వారి భవిష్యత్‌ దెబ్బతింటుందని వాదించేవారు. కానీ అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాలు, పిల్లల భవిష్యత్‌ గురించి ఏమాత్రం పట్టించుకోకుండా మోడీ ఇచ్చిన ప్యాకేజీ తీసుకొన్నారని జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతే కాదు…ప్రత్యేకహోదా కోసం నిరాహార దీక్షలు, ర్యాలీలు కూడా చేశారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే మోడీ మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పారు.

రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి వచ్చి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత ప్రత్యేకహోదాలాగే ఆనాడు ఆయన చెప్పిన ఈ మాటలన్నీ గత చరిత్రగా మారిపోయాయి. కొత్తలో మొక్కుబడిగా మూడు నాలుగుసార్లు కేంద్రానికి ప్రత్యేకహోదా గురించి గుర్తు చేశారు తప్ప ఇవ్వాలని పట్టుబట్టలేదు. కారణాలు అందరికీ తెలిసినవే. కనుక కేంద్రం కూడా మరింత స్పష్టంగా ‘ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని’ చెప్పేసింది. కాగల కార్యం గంధర్వులే చేశారన్నట్లు కేంద్రప్రభుత్వమే తనకు ఈ ప్రత్యేక ఇబ్బందిని తప్పించింది కనుక సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఆ విషయమే పూర్తిగా మరిచిపోయారు. కానీ ఆయన ప్రియ శత్రువు రఘురామకృష్ణ రాజు మాత్రం మరిచిపోనీయ దలచుకోలేదు. అందుకే ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధికి మద్దతు ఇవ్వాలంటే ఏపీకి ప్రత్యేకహోదా ఇవ్వాలని పట్టుబట్టాలని సలహా ఇస్తున్నారు!

ADVERTISEMENT
Latest Stories