అమరావతియే రాజధానిగా ఉండాలంటూ తిరుపతిలో రైతులు తలపెట్టిన సభకు అటు ప్రజల నుండి, ఇటు రాజకీయ నాయకుల నుండి మద్దతు లభించింది. ఈ వేదికపై వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరియు టిడిపి అధినేత చంద్రబాబు నాయుడులు ఆలింగనం చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
వైసీపీ తరపున గెలిచినప్పటికీ, ఇప్పటికీ పార్టీలోనే ఉన్నప్పటికీ జగన్ విధివిధానాలు నచ్చక, వ్యతిరేకంగా పోరాడుతున్న రఘురామకృష్ణంరాజు చేసిన ఎటకారం మరోసారి ఈ వేదికపైన హైలైట్ అయ్యింది. అమరావతిలో అన్ని కులాలు ఉన్నాయని, ఇక్కడున్న వారంతా ఒక కులమే అనుకునే భ్రమలో ఉన్నారంటూ జగన్ తీరును ప్రశ్నించారు.
ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే… సోదరసోదరీమణులారా… అన్నా కూడా చౌదర చౌదరీమణులారా… అన్నట్లు వినపడుతోందని పండించిన ఎటకారపు డైలాగ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమరావతి అనేది ఒక కులమో, ఒక వర్గానికో నిలయం కాదని చెప్పిన ఆర్ఆర్ఆర్, తాను ప్రతిరోజు లైవ్ లో ఈ అంశం పైన మాట్లాడుతున్నాను గనుక, అమరావతి సృష్టికర్త చంద్రబాబు నాయుడు వంటి పెద్దలు ఇంకా మాట్లాడతారంటూ ముగించారు.
రాజు గారి ఎటకారపు మాటలు వైరల్ అవ్వడం కొత్త కాదు. ప్రతి రోజు అధికార పక్షంపై విమర్శలు గుప్పిస్తూ, ఆ రోజు జరిగిన ఉదంతాలపై జగన్ తీరును ప్రజలకు తెలియజేసేలా వ్యాఖ్యానించడంలో నేర్పరులుగా మారిపోయారు. నాడు పుట్టినరోజు నాడు అరెస్ట్ అయ్యి, బెయిల్ పై బయటకు వచ్చిన ఆర్ఆర్ఆర్, అనంతరం ఢిల్లీ వెళ్లిపోయారు. ఆ తర్వాత ఇదే ఏపీలో అడుగు పెట్టడం.
సొదర సొదరీమణులారా అన్నాకూడా.. కొంతమందికి చౌదర చౌదరీమణులారా అని వినిపిస్తుంది …
RRR ragging 😂😅🤣 pic.twitter.com/ADnU49pgXO— vanusblog (@vanusblog) December 17, 2021



