రిజర్వేషన్ల సెగలే కాంగ్రెస్ కొత్త అస్త్రాలా?

Rahul-Gandhi-Congressబీజేపీ గుజరాత్ పీఠాన్ని నిలబెట్టుకున్న కాంగ్రెస్ బాగానే పోరాడిందని చెప్పుకోవచ్చు. గెలవలేకపోయాం అనే బాధ ఉన్న కాంగ్రెస్ కు గుజరాత్ ఫలితాలు కొంతవరకు ఊరటనిచ్చాయి అనే చెప్పుకోవాలి. ముఖ్యంగా పటేల్ రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ కు ఉపయోగపడిందని చెప్పుకోవాలి. పటేళ్లు ఎక్కువగా ఉండే నియోజకవర్గాలలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంది.

ADVERTISEMENT

ఇప్పుడు రిజర్వేషన్లే తమను 2019లో గట్టెకించగలవు అనే నిర్ణయానికి వచ్చింది కాంగ్రెస్. వేరువేరు రాష్ట్రాలలో కులాల మధ్య ఉన్న చిచ్చు పెట్టి పబ్బం గడుకోవడానికి సిద్ధం అవుతుందట కాంగ్రెస్. ఇదే నిజమైతే వివిధ రాష్ట్రాలలో బీజేపీకి రిజర్వేషన్ల తలపోటు మొదలు కావడం ఖాయం అనే చెప్పుకోవాలి.

2019 ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఇది మరింత ఎక్కువ కావొచ్చు. 2019లో గెలవకపోతే కాంగ్రెస్ పరిస్థితి చాలా దారుణంగా ఉండబోతుంది అనేది ఆ పార్టీకి తెలియనిది కాదు. ఆంధ్రాలో కాపు ఉద్యమం, రాజస్థాన్ లో జాట్ల ఉద్యమం ఉండనే ఉన్నాయి. దీనికి ప్రధానమంత్రి మోడీ ఎంతవరకు రెడీగా ఉన్నారో చూడాలి.

ADVERTISEMENT
Latest Stories