నాని, ఆది, నివేదా థామస్ లు నటించిన “నిన్ను కోరి” ధియేటిరికల్ ట్రైలర్ చూసిన వెంటనే ‘ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానని’ సోషల్ మీడియా ద్వారా ‘దర్శక ధీరుడు’ రాజమౌళి తన అనుభూతులు పంచుకున్న విషయం తెలిసిందే. ఈ ట్వీట్ ను ఉదహరించుకునే, ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ‘నిన్ను కోరి’ మొదటి టికెట్ ను రాజమౌళి చేతుల మీదుగా విడుదల చేసారు. ‘ఖచ్చితంగా ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తానని, నా టికెట్ ఎప్పుడిస్తారంటూ చమత్కరిస్తూ’ ఈ సందర్భంలో కూడా మరోసారి జక్కన్న స్పష్టం చేసారు.
అయితే సినిమా విడుదలైంది. ఇంకా సోషల్ మీడియాలో జక్కన్న తన రివ్యూ పెట్టలేదు. అంటే తను చెప్పినట్లుగా మొదటి రోజు మొదటి షోను రాజమౌళి చూడలేదా? సినిమా చూసిన వెంటనే, దానిపై తన భావాలు పంచుకోవడం రాజమౌళి సహజంగా పాటించే విషయం. సినిమా చూస్తే ఖచ్చితంగా తన భావాలను వ్యక్తపరిచేవారు, చూడలేదు కాబట్టే రాజమౌళి రివ్యూ రాలేదన్న విషయాన్ని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే ‘నిన్ను కోరి’ సినిమాతో పాటు వారాహి ప్రొడక్షన్స్ నుండి “రెండు రెళ్ళ ఆరు” సినిమా కూడా విడుదలైంది.
వారాహి అంటే రాజమౌళి సొంత ప్రొడక్షన్ క్రిందే లెక్క. ఈ బ్యానర్ లో వచ్చే చిత్రాలన్నింటిని రాజమౌళి దగ్గరుండి పబ్లిసిటీ చేస్తుంటారు. బహుశా ‘నిన్ను కోరి’ సినిమాకు బదులుగా ఈ ‘రెండు రెళ్ళ ఆరు’ సినిమాకు వెళ్ళారేమో అన్న టాక్ కూడా హల్చల్ చేస్తోంది. ఒకవేళ అదే జరిగితే, కనీసం ఆ సినిమా పైన అయినా రాజమౌళి తన రివ్యూను రాసేవారు కదా! అంటే ఈ ఫ్రైడే నాడు జక్కన్న ఏ సినిమాను చూడలేదన్న మాట. బహుశా ఈ సండే లోపున జక్కన్న విశ్లేషణ వస్తుందేమో చూడాలి.



