ఇటీవలే కాలంలో వైఎస్సాఆర్ కాంగ్రెస్ లో డబ్బుకు ప్రాధాన్యత పెరిగిందా అంటే అవును అని ఆ పార్టీ నేతలే అంటున్నారు. దీనికి ఉదాహరణగా టీడీపీ ఎన్నారై మహిళా నేత రజినీకుమారి సంగతి చెబుతున్నారు. 2017 మహానాడులో తన ప్రసంగంతో అందరిని ఆకర్షించిన ఆమె టీడీపీ టిక్కెట్టు ఆశించి భంగపడి ఇప్పుడు వైకాపాలో చేరారు.
[m9ad]
ఇటీవల విశాఖ జిల్లా పాదయాత్రలో ఉన్న జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన విడదల రజనీకుమారికి చిలకలూరిపేట టిక్కెట్టు దాదాపు ఖాయమైనట్లు తెలుస్తోంది. పార్టీకి భారీగా ఫండ్ ఇవ్వడానికి ఆమె ముందుకు రావడంతో టికెట్ ఆమెకే ఖరారు చేసినట్లు సమాచారం. పైగా ఎన్నికల్లో అయ్యే ఖర్చంతా తానే భరిస్తానని రజనీకుమారి పూర్తి హామీ ఇచ్చారట.
అయితే ఇదే నియోజకవర్గంలో ఎప్పటినుండో పార్టీని అంటిపెట్టుకుని ఉన్న మర్రి రాజశేఖర్ వర్గం షాక్‌కు గురైంది. పార్టీకి కష్టకాలంలో అండగా ఉన్న తమ నేతను కాదని నిన్న కాక మొన్న పార్టీలో చేరిన వారిని సమన్వయ కర్తగా నియమిస్తారా అంటూ మర్రి రాజశేఖర్ వర్గం అధిష్ఠానం తీరుపై మండిపడింది. డబ్బే ప్రధానం అయిపోతే పార్టీకి ఇబ్బందులు తప్పవని పలువురు హెచ్చరిస్తున్నారు.



