సూపర్ స్టార్ ఈవెంట్ @మలేసియా!

rajinikanth 2.0 movie teaser release in malaysiaభారీ బడ్జెట్ తో .. భారీ తారాగణంతో ‘2.0’ చిత్రం తెరకెక్కింది. రజనీకాంత్ .. అక్షయ్ కుమార్ .. ఎమీ జాక్సన్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమా కోసం అభిమానులంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల ‘దుబాయ్’లో ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఒక రేంజ్ లో నిర్వహించారు. ఆ తరువాత టీజర్ ను హైదరాబాద్ లో నిర్వహిస్తామని చెప్పారు. కానీ ఆ ఆలోచనను విరమించుకున్నారనేది తాజా సమాచారం.

ADVERTISEMENT

ఈ టీజర్ ను మలేసియాలో విడుదల చేయాలనే నిర్ణయానికి వచ్చారట. మలేసియాలో తమిళులు ఎక్కువగా ఉండటం వలన, ప్లాన్ అక్కడికి మారిపోయిందని అంటున్నారు. ఈ నెల 6వ తేదీన అక్కడ ‘కోలీవుడ్ స్టార్ నైట్’ ను నిర్వహించి, ఆ వేదికపై టీజర్ ను రిలీజ్ చేస్తారట. ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకుని ట్రైలర్ ను చెన్నైలో విడుదల చేయనున్నారు. తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని, ఏప్రిల్ 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

ADVERTISEMENT
Latest Stories