ఇటీవలే జారిగిన ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ ఘనవిజయం సాధించింది. 175 సీట్లకు గానూ 151 సీట్లు… 25 గాను 22 ఎంపీ సీట్లను ఆ పార్టీ గెలుచుకుంది. దానితో జగన్ పార్టీ కోసం పని చేసిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కు డిమాండ్ పెరిగింది. ఇప్పటికే వచ్చే పశ్చిమ బెంగాల్ ఎన్నికల కోసం అక్కడి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆయనకు కాంట్రాక్టు ఇచ్చారు.
ఆ తరువాత చంద్రబాబు నాయుడు కూడా ఆయనతో పని చెయ్యాలని వార్తలు వచ్చినా అది జరగలేదు. ఆ తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామితో, కొత్త పార్టీ కోసం కమల్ హస్సన్ తోనూ ఆయన భేటీ అయినట్టు వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజగా ఆయన రజినీకాంత్ తో భేటీ అయ్యారన్న వార్త కలకలం సృష్టిస్తోంది.
మరోవైపు రజనీకాంత్ ఎప్పుడు పార్టీ పెడతారా అన్న ఆయన అభిమానులకు సరైన సమాధానం దొరకడం లేదు. కిషోర్ తో భేటీ అయ్యారంటే బహుశా అసెంబ్లీ ఎన్నికలకు సిద్దం అవుతున్నారని ఆయన అభిమానులు భావిస్తున్నారు. అసలు ప్రశాంత్ కిషోర్ ఎవరితో పని చేస్తున్నారు అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా ఉంది.
పోనీ ఆయన తమిళ రాజకీయాలలో మహాకూటమి కోసం ప్రయత్నిస్తున్నారా? 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇటీవలే జరిగిన సాధారణ ఎన్నికలలో డీఎంకే మెజారిటీ ఎంపీ సీట్లు గెలుచుకుని వచ్చే ఎన్నికలలో ఫేవరెట్ గా ఉంది.



