టీజర్ టాక్ – మ్యాన్లీ లుక్ లో చెర్రీ!

Ram Charan Dhruva Choosa Choosa Song Promoరామ్ చరణ్ తేజ్ హీరోగా నటిస్తున్న “ధృవ” సినిమా మెగా వారసుడ్ని పూర్తిగా న్యూ లుక్ లో ప్రజెంట్ చేస్తుందన్న సంకేతాలు కనపడుతున్నాయి. ఇప్పటివరకు ఒక్క మాస్ వర్గాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుని సినిమాలు చేసిన రామ్ చరణ్, ఈ ‘ధృవ’లో మాత్రం అన్ని వర్గాల వారిని టార్గెట్ చేసినట్లుగా కనపడుతోంది. ముఖ్యంగా తాజాగా విడుదలైన ‘చూసా చూసా…’ అనే పాట రొటీన్ చెర్రీ డ్యాన్సింగ్ పాటలకు విరుద్ధంగా ఉండడం విశేషం.

అలాగే ఈ పాటలో రామ్ చరణ్ లుక్స్ మ్యాన్లీగా, యువతుల మనసు దోచుకునే విధంగా ఉన్నాయి. అయితే ఇప్పటివరకు విడుదలైన రెండు పాటలు కూడా వినడానికి డబ్బింగ్ సినిమా పాటలు మాదిరి ఉండడం గమనించదగ్గ విషయం. హిప్ హాప్ తమిజ్హ అందించిన సంగీతం ఎక్కువగా తమిళ వాసన కొడుతోంది. ఆడియో పరంగా తెలుగు ప్రేక్షకులను ఎంతవరకు అలరిస్తాయో గానీ, చిత్రీకరణతో ప్రేక్షకులను సంతృప్తి చేసినట్లుగా కనపడుతోంది.

ADVERTISEMENT

ADVERTISEMENT
Latest Stories