పవన్ స్థానాన్ని కబ్జా చేసిన రామ్ చరణ్!

Ram charan Stylish icon Asia Vision Awards 2016ప్రస్తుతం ఉన్న టాలీవుడ్ హీరోలలో యూత్ లో క్రేజ్ ఉన్న హీరో ఎవరు? అన్న ప్రశ్న వేస్తే… వెలువడే మొదటి సమాధానం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని. నిజమే… యువతరానికి ప్రతినిధిగా పవన్ ‘యూత్ ఐకాన్’ అనే బిరుదును ఎప్పుడో సార్ధకం చేసుకున్నాడు. కానీ, 2016 సంవత్సరానికి గానూ ‘యూత్ ఐకాన్’ మారాడు అంటోంది ఆసియన్ విజన్ మూవీ అవార్డ్స్.

సినీ రంగానికి సంబంధించిన పలు విభాగాల్లో అవార్డులను ప్రకటించిన ‘ఆసియన్ విజన్’ 2016 సంవత్సరానికి గానూ, ‘యూత్ ఐకాన్’గా మెగా వారసుడు రామ్ చరణ్ నిలిచారని పేర్కొంది. నవంబర్ 18వ తేదీన షార్జాలో జరగబోయే వేడుకలో ఈ అవార్డును చెర్రీకి ప్రకటించనున్నారు. అయితే అవార్డు పరంగా చెర్రీ కొల్లగొట్టినప్పటికీ, యూత్ లో ఎప్పటికీ క్రేజ్ ఉన్న హీరో పవన్ కళ్యాణే అంటున్నారు అభిమానులు.

ADVERTISEMENT

పవన్ రాజకీయ రంగం వైపుకు అడుగులు వేస్తుండడంతో, పవన్ వారసుడిగా రామ్ చరణ్ ఆ స్థానాన్ని దక్కించుకుంటారేమో! అయితే పవన్ మాత్రం ‘యూత్ ఐకాన్’ అనే బిరుదును తన స్వశక్తితో, తన నటనతో దక్కించుకున్న వైనం తెలిసిందే. ‘తొలిప్రేమ, తమ్ముడు, ఖుషీ’ వంటి సినిమాలు యూత్ లో విపరీతమైన క్రేజ్ ను ఏర్పడేలా చేసాయి. అప్పటినుండి ఇప్పటివరకు పవన్ వెనుదిరిగి చూసుకున్న సందర్భం లేదు.

ADVERTISEMENT
Latest Stories