
సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కు ఏపీ పోలీసులకు మధ్య జరుగుతున్నా దాగుడుమూతలు ఎట్టకేలకు తెరదింపారు వర్మ. కొద్దీ సేపటి కిత్రం మీడియా సమావేశాన్ని ఏర్పాటరు చేసిన వర్మ తన పై ఏపీలో నమోదయిన కేసుల గురించి, ఆ పై తనమీద మీడియాలో జరుగుతున్నా చర్చల గురించి ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసారు.
వర్మ అరెస్టు తప్పదు అంటూ జరిగిన ప్రచారంతో అజ్ఞాతంలోకి వెళ్లిన ఆర్జీవీ ఎట్టకేలకు తెర ముందుకొచ్చారు. దీనికి ఏపీ హై కోర్ట్ లో వర్మ వేసిన ముందస్తు బైలు పిటిషన్ పై మధ్యంతర ఉత్తర్వులు రావడంతో సోమవారం వరకు ఆయనను అరెస్టు చేయొద్దని ఏపీ పోలీస్ వ్యవస్థను హైకోర్టు ఆదేశించింది.
Also Read – గెట్ రెడీ..స్టే ట్యూన్డ్ టూ ‘తాడేపల్లి ఫైల్స్’..!
దీనితో వర్మకు దొరికిన టెంపరరీ ఊరట దృష్ట్యా మీడియా ముందుకొచ్చిన వర్మ తన భయాన్ని లోలోపలే అణిచివేస్తూ బయటకు మాత్రం అదే మేధావి తనాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఆయన మాటల బట్టి చూస్తుంటే వర్మలో ఇప్పటికి తానూ తప్పు చేశాను అనే భావన కనిపించడం లేదు, అలాగే భవిష్యత్ లో ఇలాంటి నీచమైన పనులు ఇక చేయను అనే మాట వినిపించడం లేదు.
మీడియా శత్రువులకు నమస్కారం అంటూ ఇంకా అదే ఇతండ వాదన ఆడుతూ, అవే తలతిక్క సమాధానములు చెపుతూ తన బుద్ది ఎన్నటికీ మారదు అనేలా వ్యవహరిస్తున్నారు.
గతంలో తానూ చేసిన తప్పులను కవర్ చేసే నేపథ్యంలో మీడియా వారి మీద రుసరుసలు, చిటపటలు ఆడుతూ తన లాజికల్ బ్రెయిన్ ను మరోసారి బయటకు తీశారు.
Also Read – తెలుగు సినిమాలకు తెలంగాణ తలుపులు మూసుకుపోయిన్నట్లేనా?
ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తుంది, దీనిలో పెట్టె పోస్టులతో ఎవరి మనోభావాలైన దెబ్బ తిన్నాయి అంటే దేశంలో ఉన్న సగం మంది జనాభాను అరెస్టు చేసి జైళ్లకు పంపాల్సిందే, అది సాధ్యమా.? తనను అరెస్టు చేయడానికి పోలీస్ లు వచ్చారని చెపుతున్న మీడియా వారు దానికి సాక్ష్యం చూపించగలరా.? ఆ పోలీసులు మీకు ఏమైనా చెప్పారా.? అంటూ మీడియా పై ఎదురు దాడి చేసే యత్నం చేసారు వర్మ.
జగన్ ప్రభుత్వంలో మూడు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన బాబు ని సైతం రాత్రికి రాత్రే ఎటువంటి ఆధారాలు చూపకుండా అరెస్టు చేయగలిగిన పోలీస్ వ్యవస్థ ఇప్పుడు కళ్ళ ముందు సాక్ష్యాలు కనిపిస్తున్నా ఇంకా మీనమేషాలు లెక్కిస్తూ ఇటువంటి వారి పైత్యానికి ఇంకాస్త బలం చేకూరుస్తున్నారు.
లోపం ఎక్కడుంది.? దీన్ని వ్యవస్థల నిర్లక్ష్యమనాలా.? లేక కూటమి ప్రభుత్వం చేతకాని తనమని సరిపెట్టుకోవాలా.? తన చర్యలతో సమాజాన్ని కలుషితం చేస్తున్న ఇటువంటి వారిని సైతం 164 సీట్లు సాధించి దేశంలోనే అత్యంత శక్తివంతమైన రాష్ట్ర ప్రభుత్వంగా నిలబడిన కూటమి ప్రభుత్వం నిలువరించలేకపోతుందా.?
అదే 2024 లో కూడా జగన్ ప్రభుత్వమే అధికారంలోకి వచ్చిఉంటే బాబు మీద పెట్టిన కేసు మల్లి తిరగతోడే వాళ్ళు కాదా.? అలాగే లోకేష్ మీద మరికొన్ని కేసులు బనాయించి టీడీపీ పార్టీని కోలుకొని దెబ్బ కొట్టేవారు కాదా.? అలాగే టీడీపీ, జనసేనలకు ఈ వర్మ, పోసాని, శ్రీరెడ్డి వంటి కింద స్థాయి వ్యక్తుల చేత అనేక అవమానాలు ఎదురయ్యాయేవి కాదా.?