గతంలో పాత్రల చుట్టూ కథలు అల్లి సినిమాలు తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు కాంట్రవర్సీ చుట్టూ కథలు రాసి దానికి అసభ్యాన్ని జోడించి చిత్రాలను తెరకెక్కిస్తున్నారు. ఇందుకు వంగవీటి, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు, లక్ష్మీస్ ఎన్టీఆర్, ఐస్ క్రీమ్ మూవీలు ప్రత్యక్ష ఉదాహరణలు.
అయితే ఒక సినీ దర్శకుడిగా వెండితెర మీద కనపర్చాల్సిన ఆయన ప్రతిభాపాటవాలను వర్మ మరోకోణంలో సోషల్ మీడియా వేదికగా ప్రదర్శిస్తుంటారు.
గత ఐదేళ్ల వైసీపీ పాలనలో జగన్ అండ చూసుకుని టీడీపీ మొదలు జనసేన వరకు బాబు, లోకేష్ నుంచి పవన్ వరకు వైసీపీ కి వ్యతిరేకంగా గళం విప్పిన ప్రతి ఒక్కరి పై వర్మ సోషల్ మీడియాలో తన పైశాచికత్వాన్ని పోస్టుల రూపంలో చూపించారు.
దానితో నాడు వర్మ పై పై చేయి సాధించలేని నాటి ఈ ఇరుపార్టీల క్యాడర్ వారి కోపాన్ని, ఆవేశాన్ని, ఆక్రోశాన్ని, అసహనాన్ని కేసుల రూపంలోకి మర్చి ఆర్జీవిని వెంటాడుతున్నారు. అయితే కూటమి ప్రభుత్వం మాత్రం ఆర్జీవీ పట్ల చూసిచూడకుండా, పట్టీపట్టకుండా వ్యవహరిస్తుంది అనే భావన సర్వత్రా వినిపిస్తుంది.
అందుకు మొన్నిఈమధ్య జరిగిన ఆర్జీవీ అరెస్టు, వెనువెంటనే బైలు అంశాన్ని ఉదహరిస్తున్నారు కూటమి మద్దతుదారులు. అయితే తాజాగా ఆర్జీవికి వ్యతిరేకంగా ఏపీలో మరో కేసు నమోదయ్యింది.
తరచూ ఎదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాలలో ఇరుకోవడం ఆర్జీవీ కొత్తేమి కాదు, అయినా ఆయన తన నోటికి తాళం మాత్రం వెయ్యరు.
ఇటీవల ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్ వ్యూ లో వర్మ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గాను వర్మ తో పాటుగా ఆ ఇంటర్ వ్యూ చేసిన యాంకర్ పై కూడా కేసు నమోదు చెయ్యాలంటూ రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ రాజమండ్రి త్రీ టౌన్ పరిధి పోలీస్ స్టేషన్ లో కాసు నమోదు చేసారు.
వర్మ వ్యాఖ్యలు సమాజంలో విదేవేశాలు రెచ్చకొట్టేలా ఉన్నాయంటూ నమోదయిన కేసు అయినా గట్టిగ నిలబడుతుందా.? లేక ఆయన సినిమాల మాదిరే వచ్చింది వెళ్ళింది అన్నటుగా కేసు నమోదయ్యింది, మూలాన పడింది అనేలా ఉంటుందా.?






