రమణ దీక్షితలు మాట ఎలా ఉన్నా… ఇది జగన్ సెల్ఫ్ గోల్!

Ramana Deekshitulu complains to ys Jaganతిరుమలలో అనేక అపచారాలు, అవినీతి జరుగుతుందని ఆరోపించిన మాజీ ప్రధాన అర్చకులు జగన్ మోహన్ రెడ్డి లోటస్ పాండ్ ఇంటి దగ్గర ప్రత్యక్షమై అందరిని ఆశ్చర్యపరిచారు. జగన్ తో దాదాపుగా మూడు గంటల పాటు మంతనాలు జరిపారు. తరువాత ఆయనను గుమ్మం దాకా వచ్చి జగన్ స్వయంగా సాగనంపారు.

ADVERTISEMENT

అప్పటిదాకా మీడియాకు సమాచారం లేకపోయినా ఎలాగో తెలిసిపోయి మీడియా అక్కడకు వచ్చేసింది. దీనితో రమణ దీక్షితలు తన గోడు వెళ్లబోసుకోవడానికి వచ్చినట్టు చెప్పుకొచ్చారు. తన పొట్ట ఎవరు నింపితే వారి దగ్గరకి వెళ్తా అని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉన్న జగన్ ఆయనకు ఏ మాత్రం సాయపడగలరో అందరికి తెలిసిందే గా!

రమణ దీక్షితుల వెనుక ఎవరో ఉన్నారని మాత్రం ప్రజలు ఈ ఉదంతంతో గట్టిగా నమ్ముతారు. దీనిపై రమణదీక్షితులే నేరుగా క్లారిటీ ఇచ్చారు. ఈ మీటింగుతో ఆయన విశ్వసనీయతను ఆయనే పోగొట్టుకున్నారు. అయితే ఇది జగన్ మోహన్ రెడ్డికి కూడా దెబ్బే. తెలిసో తేలికో జగనే చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చారు ఈ విషయంలో.

అదికాకా ఇంతకు ముందు రమణ దీక్షితులు అమిత్ షాను కలవడంతో బీజేపీ వైకాపా రహస్యమిత్రులా? ఇద్దరు కలిసే చంద్రబాబును ఇరుకున పెట్టె ప్రయత్నం చేశారా? అనే అనుమానం రాకమానదు. దీనితో రమణ దీక్షితులు సంగతి ఎలా ఉన్నా… జగన్ కు మాత్రం ఈ మీటింగు సెల్ఫ్ గోల్ అనే చెప్పుకోవాలి

ADVERTISEMENT
Latest Stories