ఏం పర్లా… ‘బాహుబలి’ నాకు తోడుగా ఉన్నాడన్న ‘భళ్ళాలదేవ’

Rana daggubati about marriageటాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ జాబితా నిదానంగా తగ్గుతూ వస్తోంది. తాజాగా అక్కినేని వారింట జరిగిన రెండు నిశ్చితార్ధ వేడుకలతో ఇంకా పెళ్లి చేసుకోవాల్సిన జాబితాలో ‘బాహుబలి’ హీరోలు ఉన్నారు. దీనిపైనే భళ్ళాలదేవుడు రానా స్పందించారు. “తన కంటే చిన్నవాళ్లైన నాగచైతన్య, అఖిల్ వివాహం చేసుకోనుండడం ఆనందంగా ఉందని, వారికి తన శుభాకాంక్షలు తెలుపుతున్నానని” అన్నారు.

“ఘాజీ” సినిమా ప్రమోషన్ లో రానా మాట్లాడుతూ… వాళ్లిద్దరూ వివాహం చేసుకున్నారని తాను కూడా వివాహం చేసుకోలేనని, అయినా టాలీవుడ్ హీరోలలో ఇంకా వివాహం కాని హీరో ‘బాహుబలి’ ప్రభాస్ తనకు తోడు ఉన్నాడని చమత్కరించాడు. తన గురించి తన కుటుంబం మొత్తానికి తెలుసని, తానిలా ఉండాలని వాళ్లే రోజూ నిబంధన విధించలేదని, అలాగని తానెప్పుడూ గీత దాటలేదని అన్నాడు ఈ భళ్ళాలదేవ.

ADVERTISEMENT

ఘాజీ సినిమా ద్వారా ఒక చారిత్రాత్మక అంశాన్ని ప్రపంచానికి చెప్పాలని తాను అందులో నటించానని, ఘాజీ ఘటన అనంతరమే భారత్-పాక్ యుద్ధం మొదలైందని వెల్లడించాడు రానా. ప్రముఖ పీవీపీ సంస్థ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో విడుదల కానుంది. ట్రైలర్ విడుదలైన తర్వాత ఈ సినిమాపై సినీ ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ADVERTISEMENT
Latest Stories