
సినీ ఇండస్ట్రీ లో హీరోల డామినేషన్ ఎక్కువ ఫీ మేల్ యాక్ట్రెస్ ల ప్రాధాన్యం తక్కువ అంటూ కొంతమంది నటీమణులు తమ సినిమాల ప్రమోషన్స్ లో అంతగా శ్రద్ద చూపించారు. అలాగే హీరోతో సమానంగా మూవీ ప్రమోషనల్ ఈవెంట్స్ లో కూడా ఎక్కువగా కనిపించరు.
కానీ నేషనల్ క్రష్ రష్మిక, న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి మాత్రం తమ సినిమా ప్రమోషన్ల విషయంలో ప్రాణం పెడతారనే చెప్పాలి. మొన్నఈమధ్య ఒక విమనాశ్రమంలో కాలు ప్రాక్చర్ తో వీల్ చైర్ లో దర్శనమిచ్చారు రష్మిక. దీనితో ఆమె తాజాగా నటించిన బాలీవుడ్ మూవీ ‘చావా’ ప్రమోషన్స్ లో పాల్గొనకపోవచ్చు అనుకున్న ఆమె అభిమనులకు కొద్దీ సేపటికే అసలు విషయం అర్ధమయ్యింది.
Also Read – అయ్యో పాపం ఆమాద్మీ… ఇలా కూడానా?
అసలు ఆమె ఆ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొనడానికే ఎయిర్ ఫోర్ట్ కు వీల్ చైర్ మీద వచ్చారు అనే విషయం అర్ధమైన సినీ అభిమానులు రష్మిక కు తన మూవీస్ మీద ఇంత ప్రేమా అంటూ ఆమె డెడికేషన్ కు ఫిదా అయ్యారు. అంతకు ముందు నటించిన యానిమల్ మూవీ కానీ పుష్ప సిరీస్ ప్రమోషన్స్ లో కూడా రష్మిక నటనలో మాదిరే సినిమా ప్రమోషన్స్ లో కూడా పరకాయ ప్రవేశం చేసిన విషయం తెలిసిందే.
అలాగే ఇటు హైబ్రిడ్ పిల్లగా తెలుగు ఆడియన్స్ హృదయాలను ఫిదా చేసిన న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి కూడా తన సినిమాల ప్రమోషన్స్ విషయంలో ఎక్కడ తగ్గేదెలా అన్నట్టుగా దూసుకుపోతుంటారు. ఇటువంటి నేపథ్యంలో తాజాగా విడుదలకు సిద్డమైన తండేల్ మూవీ లో చై సరసన హీరోయిన్ గా నటించిన పల్లవి ఆ మూవీ ప్రమోషన్ ఈవెంట్ లో కనిపించలేదు.
Also Read – ఐసీయూ లో ఉన్న వైసీపీకి చిరు ఊతమిస్తే…టీడీపీ ఊపిరి తీసింది.!
దీనితో సాయి పల్లవికి ఏమైంది అంటూ ఆమె అభిమానులు కంగారు పడగా ఆమెకు చిన్న పాటి ఆరోగ్య సమస్య రావడంతో ఈవెంట్ కు రాలేకపోయింది, ఇక పై జరగబోయే మూవీ ప్రమోషన్స్ లో సాయి పల్లవి తప్పక కనిపిస్తారు అంటూ చిత్ర బృందం తెలియచేసారు. అయితే అనుకున్నట్టుగానే నేడు జరగబోయే తండేల్ మూవీ ఈవెంట్ కు హీరో నాగ చైతన్య, నిర్మాత అరవింద్ తో కలిసి ఈ అమ్మడు కూడా సందడి చేసిన వీడియో ‘బ్యూటీ ఈజ్ బ్యాక్’
అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పల్లవి లాస్ట్ మూవీ అమరన్ విషయంలో కూడా అది తెలుగు డబ్బింగ్ మూవీ అయినప్పటికీ తెలుగు వారికీ ఆ ఆలోచనే దరి చేరకుండా హీరో శివ కార్తికేయన్ తో సంబంధం లేకుండా ఒంటి చేతి మీద మూవీని ప్రమోట్ చేసారు, అలాగే అనూహ్య విజయాన్ని సొంతం చేసుకున్నారు. దీనితో ఆ విషయంలో రష్మిక..సాయిపల్లవి ఇద్దరు ఇద్దరే అనే స్లోగన్ మొదలయ్యింది.