రష్మిక… అంది వచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటుందా?

Rashmika Mandanna fetched good oppurtunitiesకన్నడ కుట్టి రష్మిక మందన్నా ఇప్పటివరకూ తెలుగులో మూడు సినిమాలలో నటించారు. ఛలో, గీతగోవిందం, మరియు దేవదాసులో రెండు హిట్లు ఒక ప్లాప్. ఇప్పుడు ఈ అమ్మడుకి రెండు మంచి అవకాశాలు దక్కాయి. నితిన్ నటిస్తున్న భీష్మా, మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరులో ఆమె అవకాశాలు రాబట్టుకున్నారు. భీష్మా షూటింగు రేపు మొదలు కాబోతుంది. రష్మికను ఛలో సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన వెంకీ కుడుముల ఈ సినిమా దర్శకుడు.

ఈ నెలాఖరుకి రష్మిక సరిలేరు నీకెవ్వరు షూటింగ్ మొదలు పెడుతుంది. ఆమె కెరీర్ లో ఇదే అతిపెద్ద ప్రాజెక్టు. దీనితో హిట్ కొడితే ఆమె వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. భీష్మా కూడా హిట్ అయితే ఇక టాప్ లీగ్ లోకి వెళ్ళిపోయినట్టే. రష్మిక తదుపరి చిత్రం డియర్ కామ్రేడ్ ఈ నెల 28న విడుదల అవుతుంది. గతంలో గీత గోవిందంలో విజయ్ దేవరకొండ పక్కన నటించిన రష్మిక ఈ సినిమాలో కూడా అదే హీరోతో చేస్తుంది. ఇది కూడా హాట్ ప్రాజెక్ట్ అనే చెప్పుకోవాలి.

ADVERTISEMENT

సరిలేరు నీకెవ్వరు వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అవుతుంది. భీష్మా షూటింగ్ కూడా తొందరగా పూర్తి చేసి ఈ ఏడాది చివరలో గానీ వచ్చే ఏడాది మొదట్లో గానీ విడుదల చెయ్యడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. మహర్షి సినిమాతో వంద కోట్ల క్లబ్ లోకి ఎంటరైన మహేష్ బాబు ఈ చిత్రంతో బాహుబలి రికార్డులను తిరగరాయాలని ఆసక్తిగా ఉన్నారు. వరుసగా మూడు ప్లాపులు ఇచ్చిన నితిన్ భీష్మాతో తిరిగి ఫామ్ లోకి రావాలని గంపెడు ఆశలు పెట్టుకున్నాడు.

ADVERTISEMENT
Latest Stories