అ.. ఆ తరువాత నితిన్ కు ఒక్క హిట్ కూడా లేదు. ఆ తరువాత వచ్చిన లై, చల్ మోహన్ రంగ, శ్రీనివాస కళ్యాణం సినిమాలు భారీ పరాజయాన్ని మూటగట్టుకున్నాయి. శ్రీనివాస కళ్యాణం తరువాత నితిన్ పెద్ద బ్రేక్ తీసుకున్నారు. బ్రేక్ తీసుకున్నా ఆయన తన తదుపరి చిత్రాలకు ఇద్దరు ప్రామిసింగ్ డైరక్టర్లు, ఇద్దరు క్రేజీ హీరోయిన్లు సెట్ చేసుకోవడం విశేషం. నితిన్ తన తదుపరి చిత్రం వెంకీ కుడుమల తో చేస్తున్నారు. భీష్మ అనే పేరుతో వచ్చే ఈ సినిమా ఈనెల నుంచి సెట్ మీదకు వెళ్తోంది.
భీష్మ సినిమాను డిసెంబర్ 20 విడుదల చెయ్యడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ఈ సినిమా తరువాత వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా స్టార్ట్ అవుతుంది. వెంకీ తన చివరి సినిమాతో పరాజయం మూటగట్టుకున్నారు. అయినా ఆయన టాలెంటెడ్ అని అందరు ఒప్పుకునే విషయమే. భీష్మ సినిమాకు రష్మిక హీరోయిన్ గా ఫిక్స్ అయితే వెంకీ అట్లూరి సినిమాకు కీర్తిసురేష్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్లు ఫిలింనగర్ వర్గాలు తెలుపుతున్నాయి.
రష్మిక మహేష్ బాబు సరసన సరిలేరు నీకెవ్వరు సినిమాలో నటిస్తుంది. గతంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో నటించిన కీర్తిసురేష్ ఆ తరువాత మహానటి తో పెద్ద హిట్ కొట్టింది. మొత్తం మీద కేరీర్ లో బాగా వెనుకబడి ఉన్న సమయంలో నితిన్ ప్రామిసింగ్ డైరక్టర్లు, హీరోయిన్లు సెట్ చేసుకోవడం ఆయనకు చాలా మంచి పరిణామం. ఈ రెండు సినిమాలతో రెండు హిట్లు కొట్టేస్తే ఇక ఆయనకు వెనక్కు తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. చూడాలి ఏం జరగబోతుంది అనేది.



