గత మూడు నెలలుగా నగదు కొరత ఇబ్బందులు పడిన దేశ ప్రజానీకానికి ఉపశమనం అందించే కబురును రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అందించింది. నవంబర్ 8వ తేదీ రాత్రి సమయం నుండి ప్రారంభమైన కరెన్సీ కష్టాలకు జనవరి 31వ తేదీ శుభంకార్డు వేయనుంది. అవును… ఒక్క సేవింగ్స్ ఖాతాలు మినహా, కరెంట్, క్యాష్ క్రెడిట్, ఓవర్ డ్రాఫ్ట్ వంటి ఇతర ఖాతాలపై ఉన్న నిబంధనలను పూర్తిగా ఎత్తివేస్తూ రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం వెల్లడించింది. ముఖ్యంగా వ్యాపారస్తులకు ఇది చాలా సానుకూలమైన నిర్ణయంగా భావించవచ్చు.
దీంతో ఇక జనాల జేబుల్లో క్యాష్ కళకళలాడడం ఖాయంగా చెప్పవచ్చు. అయితే సేవింగ్స్ ఖాతాలపై మాత్రం ప్రస్తుతం ఉన్న నిబంధనే మరికొంత కాలం కొనసాగనుంది. ఈ ఖాతాలపై రోజుకు 10 వేలు మాత్రం విత్ డ్రా చేసుకునే సదుపాయం ఉండగా, అది వారానికి గరిష్టంగా 24 మాత్రమే విత్ డ్రా చేసుకోవచ్చు. బహుశా ఫిబ్రవరి నెలాఖరు వరకు ఈ సేవింగ్స్ ఖాతాలపై ఈ నిబంధన ఉండవచ్చని, ఆ తర్వాత ఇది కూడా సడలించే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయని సమాచారం. ఆర్బీఐ తాజా నిర్ణయంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Win Rs.1000 Paytm for closest guess of @NameisNani 's #NenuLocal USA Premiere Collections ends by Thur 7pm IST#M9NewsWin1000 3rd contest pic.twitter.com/PcsmdS09lQ
— M9News (@M9News) 31 January 2017



