ఆ మాట చెప్పలేకే జగన్ కియా మోటార్స్ కు వెళ్ళలేదా?

Reasons for YS Jagan not went to kia motos car launchఆంధ్రప్రదేశ్‌ ఆటోమొబైల్‌ రంగంలో నవశకం ఆరంభమైంది. ఆంధ్రా తయారీ కియా కారు లాంఛనంగా మార్కెట్‌లోకి విడుదలైంది. సెల్టాస్‌ మోడల్‌ వాహనాన్ని గురువారం కియా సంస్థ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి హాజరు కావాల్సి ఉండగా ఆయన చివరి నిముషంలో తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఢిల్లీ పర్యటన ఇంకో రోజు పొడిగించుకున్నామని చెప్పినా, జగన్ వచ్చేశారు. ఈరోజే వచ్చేసి పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద బాధిత ప్రాంతలలో ఏరియల్ సర్వేకు వెళ్లారు.

ఈ కార్యక్రమంలో కియా సంస్థ ప్రతినిధులతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ, ఏపీఐఐసీ ఛైర్‌పర్సన్‌ రోజా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… రాయలసీమలో పరిశ్రమల అభివృద్ధికి పూర్తి సహకారం అందిస్తామని రోజా స్పష్టం చేశారు. ఏపీఐఐసీ నుంచి కియా మోటార్స్‌కు సహకరం అందిస్తామని వెల్లడించారు. కియాలో 75శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని రోజా కోరారు.

ADVERTISEMENT

ఇటీవలే అన్ని పరిశ్రమలలో 75శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చట్టం చేసింది. అయితే దీనివల్ల కంపెనీలు తరలిపోతాయని పలువురు హెచ్చరిస్తున్నారు. కార్యక్రమానికి జగన్ వెళ్లి యాలో 75శాతం స్థానికులకే ఉద్యోగాలు కల్పించాలని అడిగితే అది ఇబ్బంది కావొచ్చని, అందుకే వెళ్లకుండా మంత్రులను పంపించారని, కేబినెట్ లో లేని రోజాతో ఆ మాట అనిపించారని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ADVERTISEMENT
Latest Stories