రెబెల్స్ చక్రవ్యూహంలో ప్రధాన పార్టీలు సతమతం

Congress Party Mahakutamiతెలంగాణ ఎన్నికలలో నామినేషన్ల తంతు ముగిసింది. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 3584 అభ్యర్థులు బరిలో ఉన్నారు. దీనిట్లో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, తెరాస, బీజేపీ, టీడీపీ, ఎంఐఎం తరపునే 915 నామినేషన్లు పడ్డాయి. దీనిబట్టి ఆయా పార్టీలకు రెబెల్స్ బెడద తప్పదు అని తెలుస్తుంది. నవంబర్ 22 నామినేషన్ల ఉపసంహరణకు చివరి గడువు. దీనితో పార్టీలు అసంతృప్త నేతలతో సంప్రదింపులు జరుపుతున్నాయి. టిక్కెట్లు రాని మహాకూటమి పార్టీ నేతలు చరిత్రలో ఎప్పుడూ లేనట్టుగా ఒక ఫ్రంట్ గా ఏర్పడటం కూడా ఈ ఎన్నికలలోనే మనం మొదటి సారిగా చూశాం.

ADVERTISEMENT

[m9ad]

దీనితో ఆయా పార్టీలు అసంతృప్త నేతలను… గెలిస్తే తరువాత వేరే వేరే ఏర్పాట్లు చేస్తాం నామినేటెడ్ పదవులు కాంట్రాక్టులు ఇస్తాం అంటూ బుజ్జగిస్తున్నాయి. ఇందులో మాట వినేవారు ఎవరో వినని వారెవరో చివరి రోజు వరకు వేచి చూడాలి. తెరాస ముందే అభ్యర్థులను ప్రకటించడం వల్ల ఆ పార్టీకు రెబెల్స్ తో మాట్లాడటానికి సరైన సమయం దొరికింది. అయినా వారికి రెబెల్స్ బెడద ఎక్కువగానే ఉంది. అయితే చివరి వరకు కాలయాపన చెయ్యడంతో మహాకూటమి పక్షాలకు పెద్దగా సమయం దక్కలేదు.

అటు కాంగ్రెస్ మిత్రులకు కేటాయించిన సీట్లలో కొన్ని చోట్ల కూడా అభ్యర్థులకు బి-ఫారం ఇచ్చింది. దీనితో ఆ పార్టీలు అసంతృప్తిగా ఉన్నాయి. స్నేహపూర్వక పోటీలకు ససేమిరా అంటున్నాయి. ఇచ్చినవే అతి కొద్ది సీట్లు అందులో మళ్ళీ స్నేహపూర్వక పోటీలంటే తమని నమ్మించి గొంతు కొయ్యడమే అని ఆ పార్టీలు అంటున్నాయి. దీనితో వాటిని ఎలా సర్దుబాటు చేసుకుంటాయో కూడా చూడాలి. వీటిని సర్దుకోవడంలోనే మహాకూటమి విజయావకాశాలు ముడిపడి ఉంటాయి.

ADVERTISEMENT
Latest Stories