‘ఫ్రీ ఆఫర్’ ఉన్నంత వరకే జియో మనుగడ, ఆ తర్వాత ‘జియో’కు అంత సీన్ లేదు అని అంచనాలు వేసిన వారికి షాకింగ్ న్యూస్ అందుతోంది. ఇప్పటివరకు జియోకున్న కస్టమర్లలో దాదాపుగా 84 శాతం మంది ‘ప్రైమ్’ సభ్యత్వాన్ని తీసుకునట్లుగా ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. ఇంకా మరో వారం సమయం మిగిలి ఉండడంతో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం స్పష్టంగా కనపడుతోంది.
అంటే తదుపరి మాసాలలో కూడా జియోదే హవా అని యూజర్లు చెప్పకనే చెప్తున్నారు. దీంతో ఇంత టెలికాం నెట్ వర్క్ల గుండెల్లో మరోసారి దడ పుట్టించినట్లయ్యింది. ఈ సందర్భంగా మరో బంపర్ ఆఫర్ ను కూడా ప్రకటించింది జియో. తమ ప్రైమ్ సభ్యత్వాన్ని తీసుకొని, జియో ప్రవేశపెట్టిన ప్లాన్లను ఏప్రిల్ 1వ తేదీ కన్నా ముందే, రీ చార్జ్ చేసుకున్న వారికి అదనంగా మరో 10జీబీ డేటాను ఉచితంగా అందించనున్నట్లు పేర్కొంది.
ప్రైమ్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారి కోసం 149 పథకం కింద 2జీబీ డేటాతో పాటు అపరిమిత ఉచిత కాల్స్ ఉండగా, తాజాగా మరో 1జీబీ డేటాను అందిస్తోంది. ఇక 303 ప్లాన్‌లో ఇచ్చే 28 జీబీ డేటాతో పాటు ఉచితంగా మరో 5జీబీ డేటాను అందిస్తోంది. మరోవైపు 499 రీ ఛార్జ్ తో నెల వారీ పథకం కింద మరో ఆఫర్ ను ఉంచింది. ఇలా ఒక దాని మీద ఒకటి బంపర్ ఆఫర్లను ప్రకటిస్తుండడంతో జియో వినియోగదారులు కూడా ఫుల్ ఖుషీలో ఉంటున్నారు.



