సినీనటి రేష్మ ఇటీవలే బీజేపీలో జాయిన్ అయ్యారు. పార్టీలో జాయిన్ అయినవెంటనే ఆమెను బీజేవైఎం రాష్ట్ర కార్యదర్శిని చేశారు. ఆమె వైరా నియోజకవర్గంలో బీజేపీ తరపున బరిలో దిగేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఈ మేరకు ఆమె ఇప్పటికే పార్టీ రాష్ట్ర నాయకత్వానికి తన వినతిని కూడా అందించినట్టు సమాచారం.
[m9ad]
పార్టీలో చేరిన కొత్తలో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావించినా అంతకంటే ముందుగానే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో వైరా నియోజకవర్గంపై దృష్టిసారించారు. ఇందులో భాగంగానే కొంతకాలంగా ఆమె నియోజవర్గంలో పర్యటిస్తూ.. పలు కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు.
ఇల్లెందు, కారేపల్లి ప్రాంతాలతో సత్సంబంధాలు కలిగి ఉన్న ఆమె.. కొంతకాలంగా వైరా నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే వైరాలో గెలుపుపై పెద్దగా ఆశలు లేకున్నా పార్టీ బలాన్ని పెంచుకునేందుకు ఈ అసెంబ్లీ ఎన్నికలను ఉపయోగించుకోవాలని భావిస్తోంది.



