సంధ్య థియేటర్ తొక్కిసలాట ఇష్యూ పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ పై విరుచుకుపడ్డారు. తాను అధికారంలో ఉన్నన్ని రోజులు బెనిఫిట్ షోస్, టిక్కెట్ రేట్లు పెంచుకునే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
అల్లు అర్జున్ వల్లే ప్రీమియర్లు, హైకులు లేకుండా పోయాయి అని కొందరు అంటున్నారు.
అల్లు అర్జున్ మాత్రమే కాదు… ఇప్పుడు ఆ రోజు బన్నీని పరామర్శించడానికి లైన్ కట్టిన అందరికీ అందులో పార్ట్ ఉన్నట్టే అయ్యింది.
అల్లు అర్జున్ తో పాటు వారి మీద కూడా రేవంత్ రెడ్డికి సమానంగా కోపం ఉన్నట్టు ఉంది. ఒక్కరు కాదు చిన్న నుండి పెద్ద వరకు అందరూ ఇందులో భాగస్వాములే.
జైలు నుండి విడుదల అయ్యాకా సైలెంట్ గా అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళిపోయినా… ఆయన ఇంటికి ఎవరు వెళ్లకపోయినా ఇంత వరకు వచ్చేది కాదేమో!
పబ్లిక్ సెంటిమెంట్ కూడా అల్లు అర్జున్ కు, ఇండస్ట్రీకి వ్యతిరేకంగా అయిపోయింది ఈ ఒక్క ఇష్యూ తో…
అప్పటివరకు ప్రభుత్వం ఈ విషయంలో కొంచెం అతిగా ప్రవర్తించింది అనే అభిప్రాయం ఉన్నా… అల్లు అర్జున్, ఇండస్ట్రీ అంతా కలిసి రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చేశారు.
“అల్లు అర్జున్ కాలు పోయిందా? కన్ను పోయిందా? దేనికి మీ పరామర్శలు? పాపం ఆసుపత్రి లో కొట్టుమిట్టు ఆడుతున్న చిన్నారి ని పరామర్శిచడానికి ఒక్కరికి మనసు రాలేదు,” అని రేవంత్ రెడ్డి ప్రశ్నిస్తే ఎవరి దగ్గరా సమాధానం లేకుండా పోయింది.
ఇకపోతే బెనిఫిట్ షోస్, రేట్లు పెంచుకోవడం లేకపోవడం అనేది ఇండస్ట్రీకి పెద్ద దెబ్బ అనే చెప్పుకోవాలి. రేవంత్ రెడ్డి ఇంత పర్సనల్ గా తీసుకున్నారు కాబట్టి నాలుగేళ్ల పాటు ఇదే పరిస్థితి కొనసాగవచ్చు.
పెద్ద స్టార్ సినిమాలకు, పాన్-ఇండియా సినిమాలకు ఇది పెద్ద దెబ్బ. అందరికంటే ముందు ఎఫెక్ట్ అయ్యేది సంక్రాంతికి విడుదల కాబోతున్న రామ్ చరణ్ గేమ్ చేంజర్.
సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ ప్రకటన చేశారు కనుక… ఈమధ్యనే FDC చైర్మన్ గా నియమింపబడ్డ గేమ్ చేంజర్ నిర్మాత దిల్ రాజు కూడా ఈ విషయంలో ఏమీ చెయ్యలేని పరిస్థితి ఉన్నట్టుంది.
ఇక తెలంగాణ లో బెనిఫిట్ షోస్, టిక్కెట్ Hike లేనట్టే…
First Big Blow to Dil Raju as his #Gamechanger will be the first affected#AlluArjun pic.twitter.com/5rKJCW1oDK
— M9 NEWS (@M9News_) December 21, 2024




