తెదేపా నాయకులకు రేవంత్ రెడ్డి షాకింగ్ ఆహ్వానం!

Revanth Reddy invites TDP MLA meetingతెలంగాణా తెలుగు దేశం నాయకులకు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మరో షాక్ ఇచ్చారు. రేవంత్ పార్టీ వీడటం కన్‌ఫార్మ్ అని అనుకుంటుండగా టీడీఎల్పీ సమావేశానికి టీ టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ సహా పార్టీ నేతలందరినీ రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

ADVERTISEMENT

అసెంబ్లీలోని టీడీఎల్పీ కార్యాలయంలో ఉదయం 11గంటలకు సమావేశం జరగనుంది. 27వతేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా టీడీఎల్పీ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఆహ్వానం నేతలను ఒకింత ఆశ్చర్యానికి గురిచేసింది. ఐతే రేవంత్ రెడ్డికి ఇప్పటికే నోటీసులు జారీచేశారు.

రేవంత్‌రెడ్డి ఢిల్లీ వెళ్లడం.., రాహూల్ గాంధీని కలవడం వంటి పరిణామాలు చోటుచేసుకున్న నేపధ్యంలో వాటికి సమాధానం ఇవ్వాలని ఆ నోటీస్లో ఉంది. తెలుగుదేశం తెలంగాణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్ష, శాసనసభా పక్ష నేత పదవుల నుంచి రేవంత్‌రెడ్డిని తొలగించాలని చంద్రబాబు ని ఆ పార్టీ నేతలు కోరారు.

ADVERTISEMENT
Latest Stories