తెదేపా వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో జాయిన్ కావడం దాదాపుగా ఖరారు ఐనట్టే. వచ్చే నెల 10న రాహుల్ గాంధీ సమక్షంలో వరంగల్ లో జరగనున్న భారీ బహిరంగ సభలో ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటారని సమాచారం. ఐతే రేవంత్ డిసిషన్ను ఆయన సొంత కార్యకర్తలు సైతం ఆమోదించడం లేదు.
కొడంగల్ నియోజకవర్గంలో రేవంత్ ముఖ్య అనుచరులుగా టీడీపీలో కొనసాగుతున్న మద్దూర్‌కు చెందిన జడ్పీటీసీ అనసూయ బాల్‌సింగ్‌నాయక్, ఎంపీపీ సంగీత శివకుమార్, మండల పార్టీ అధ్యక్షుడు శివరాజ్, వీరేశ్‌గౌడ్ తదితరులు టీడీపీని వీడి అధికార పార్టీలో జాయిన్ అయ్యారు.
తామంత జీవితాంతం కాంగ్రెస్ కు వ్యతిరేకంగా పనిచేసాం అని ఇప్పుడు రేవంత్ కోసం ఆ పార్టీలో జాయిన్ కాలెం అని వారంతా చెప్తున్నారు. దీనితో రేవంత్ కు భవిష్యత్తులో పెద్ద తలనొప్పిగా సంభవించే అవకాశం కనిపిస్తుంది. రేవంత్ రెడ్డి సెల్ఫ్ గోల్ వేసుకుంటున్నారా?


