భూ ధరణి vs భూ భారతి….

Revanth Reddy and Harish Rao land row

తెలంగాణ రాజకీయాలలో అధికార కాంగ్రెస్ విపక్ష బిఆర్ఎస్ గా మొదలైన రాజకీయ యుద్ధం కాస్త ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి vs కల్వకుంట్ల గా మారింది. నేడు సీఎం రేవంత్ అసెంబ్లీ సాక్షిగా కల్వకుంట్ల భూ దందాలు అంటూ 440 ఎకరాల భూమి కల్వకుంట్ల కుటుంబ సభ్యుల పేరు మీద ఉందంటూ లెక్కలు చెప్పారు.

అయితే ఈ భూమంతా కేసీఆర్ తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని సంపాదించేది, గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రవేశ పెట్టిన భూ ధరణి అందుకు పునాదులు వేసిందని రేవంత్ ఆరోపించగా, దానికి కౌంటర్ గా బిఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి హరీష్ మీడియా ముందుకొచ్చారు.

ADVERTISEMENT

రేవంత్ భూ ధరణి లో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ ఆరోపించగా భూ ధరణి స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి ద్వారా సుమారు 9200 కు పైగా అక్రమ లావాదేవీలు జరిగాయంటూ రేవంత్ టార్గెట్ గా హరీష్ విమర్శలు ఎక్కుపెట్టారు.

నేడు అసెంబ్లీ లో కల్వకుంట్ల భూ లెక్కలు అంటూ సీఎం రేవంత్ చెప్పిన భూమంతా కూడా తాము తమ ఎన్నికల అఫడవిట్ లో చూపించేదేనని, ఇప్పుడు రేవంత్ కొత్తగా విచారణ జరిపి కనిపెట్టాల్సింది ఏమి లేదంటూ మండిపడ్డారు. అలాగే కల్వకుంట కుటుంబానికి వ్యతిరేకంగా రేవంత్ చేసిన ఆరోపణలకు కౌంటర్ గా హరీష్ రేవంత్ కుటుంబ భూముల వివరాలను బయటకు తెచ్చారు.

రేవంత్ కుటుంబ సభ్యుల పేరు మీద 308 ఎకరాల భూమి ఉందని, రేవంత్ కుటుంబ సభ్యుల భూముల పక్కనే బులెట్ ట్రైన్ అలైన్మెంట్ వెళ్తుందంటూ హరీష్ రేవంత్ పై ఎదురుదాడికి దిగారు. 22A పై విపక్షం చేస్తున్న విమర్శలను సరిచేసుకోకుండా, తిరిగి మా పైనే విమర్శలు చేస్తూ రేవంత్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ ఆరోపించారు హరీష్.

ఇటు కల్వకుంట్ల కవిత సైతం తానూ ఎన్నికల అఫిడవిట్ లో చూపించిన దానికన్నా ఒక్క గజం ఎక్కువున్నా ఆ భూమి ప్రభుత్వాన్ని అప్పగిస్తానంటూ రేవంత్ సర్కార్ కి సవాల్ విసిరారు. అలాగే గుంటనక్క – గుంపు మేస్త్రి అంటూ అటు హరీష్ పై కూడా తన అక్కసు వెళ్లగక్కారు.

నాడు బిఆర్ఎస్ ప్రభుత్వంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భూ ధరణి, నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ తీసుకొచ్చిన భూ భారతి ప్రజా సమస్యల పరిష్కారానికి బదులు ఇలా వందల ఎకరాల రాజకీయ నాయకుల భూ దందాలు బయటపెట్టే చిట్టా పొద్దులుగా మారిపోతున్నాయి.

ADVERTISEMENT
Latest Stories