ఏపీ, తెలంగాణ మాజీ సిఎంలుగా చేసిన జగన్, కేసీఆర్‌లకు ఎవరూ ప్రజాస్వామ్య పాఠాలు నేర్పించవలసిన అవసరమే ఉండకూడదు. కానీ నేర్పించాల్సి వస్తోంది. కేసీఆర్‌ని ఉద్దేశించి తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అవి అక్షరాల జగన్‌కు కూడా వర్తించేలా ఉండటం విశేషం.
“మీరు (కేసీఆర్) తెలంగాణ రాజకీయాలలో పెద్దమనిషిని అనుకుంటారు. మీకు అపారమైన అనుభవం, తెలివితేటలు ఉన్నాయని అనుకుంటారు.
Also Read – కుమారస్వామికి అలా పుణ్య ఫలం దక్కింది!
మీరు ఎమ్మెల్యేగా కూడా గెలిచారు. అటువంటప్పుడు శాసనసభ సమావేశాలకు వచ్చి, వివిద అంశాలపై చర్చలో పాల్గొని మీ అభిప్రాయలు చెప్పండి. మా ప్రభుత్వానికి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వండి. కానీ శాసనసభలో మీ సీటు ఖాళీగా పెట్టడం సబబా? మిమ్మల్ని మేము కూడా పెద్దమనిషిగా భావించి ఆహ్వానిస్తున్నాము కనుక మీరు మీ గౌరవం నిలబెట్టుకుంటే బాగుంటుంది.
మీరు అధికారంలో ఉన్నప్పుడు అధికార పక్షం, ప్రతిపక్షాలు అంటే సరిహద్దు వద్ద ఇండియా-పాకిస్తాన్ సైనికుల్లా పరస్పరం శత్రువులుగా భావించుకుంటూ కత్తులు దూసుకోవాలని మీరు ఎందుకు అనుకున్నారో తెలీదు. కానీ మీ ఆలోచనే మన రాజకీయాలను కలుషితం చేసింది.
Also Read – వైసీపీ గొంతులో విశాఖ ఉక్కు దిగిందిగా!
మాకు లేని అధికారం ఈ రేవంత్ రెడ్డికి ఎందుకనే అసూయ మీ పిల్లలిద్దరికీ ఉండొచ్చు. కనుక వారు మా ప్రభుత్వం గురించి నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతుంటే, పెద్దమనిషినని భావిస్తున్న మీరు వారించాలి కదా?కానీ మీరే వారిని మా ప్రభుత్వంపైకి ఎందుకు ఉసిగొల్పుతున్నారు?
అయినా మేమేమీ మీ నుంచి బలవంతంగా అధికారం లాగేసుకోలేదు కదా? ప్రజలు ఎన్నుకుంటే అధికారంలోకి వచ్చాము. మా పాలన మీకు నచ్చకపోవచ్చు. కానీ అంత మాత్రాన్న మీరు మా ప్రభుత్వం కూలిపోవాలనో కూల్చేయాలనో ఆలోచనలు చేయడం సబబేనా?
Also Read – ఈ విజ్ఞప్తిపై చంద్రబాబు ఆలోచించడం అవసరమే!
మా సహనానికి కూడా హద్దుటుంది. మీ పిల్లలు గీత దాటితే తప్పకుండా చర్యలు తీసుకోవాలసి వస్తుందని ముందే హెచ్చరిస్తున్నాను,” అన్నారు రేవంత్ రెడ్డి.
రేవంత్ రెడ్డి చెప్పిన ఈ హితోక్తులు అక్షరాల వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి కూడా వర్తిస్తాయని అర్దమవుతూనే ఉంది.
అయితే కేసీఆర్‌లాగే జగన్‌కి కూడా అహంభావం, నేను మాత్రమే మేధావిని అనే నిశ్చితాభిప్రాయం ఉంది. కనుక ఇద్దరూ ఒక్కలాగే ప్రవర్తిస్తున్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్, ఫుట్‌బాల్ క్రీడాకారులు, వారి కోచ్‌లు తమ ప్రత్యర్ధి జట్ల ఆటగాళ్ళు ఏవిదంగా ఆడుతున్నారో, వారి ఎటువంటి వ్యూహాలు అమలుచేస్తున్నారో తెలుసుకునేందుకు వారి ఆట వీడియోలు చూస్తుంటారు.
ఆదేవిదంగా జగన్, కేసీఆర్ కూడా అహంకారం, భేషజాలు పక్కన పెట్టి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి నుంచి మంచి విషయాలు నేర్చుకుంటే వారికే మంచిది.
శత్రువుల నుంచి కూడా కొత్త విషయాలు నేర్చుకోవడానికి సిద్దపడినవాడు జీవితంలో ఎన్నడూ ఓడిపోడు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఇద్దరూ అలా నేర్చుకున్నవారే కనుక రాణించగలుగుతున్నారు కదా?