తనకు ప్రాణహాని ఉందంటూ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణలను హైదరాబాద్ హై కోర్టు సీరియస్ గా తీసుకుంది. రేవంత్‌రెడ్డి భద్రత రాష్ట్ర ప్రభుత్వానిదేనని తేల్చి చెప్పింది. 4+4 భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యేంత వరకూ ఈ భద్రతను కొనసాగించాలని పేర్కొంది. గతంలో ఆయనకు కేంద్ర ప్రభుత్వాన్ని భద్రత కలిపించమని కోర్టు ఆదేశించింది. అయితే అది అమలు కాలేదు.
[m9ad]
దీనిపై తాజాగా కేంద్ర హోంశాఖ హైకోర్టులో అప్పీల్ చేసింది. స్థానిక నేతల భద్రత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, రేవంత్‌కు కేంద్రం భద్రత కల్పించాలన్న సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవరించాలని కోరింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పును వెలువరించింది. రేవంత్‌రెడ్డికి భద్రతను రాష్ట్ర ప్రభుత్వమే కల్పించాలని ఆదేశించింది. అయితే రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రభుత్వానికీ ఉన్న విబేధాల సంగతి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర భద్రత కలిపిస్తే ఆయనకు భద్రత ఎక్కువగా ఉండేది.
ఎన్నికల సమయంలో రాష్ట్రప్రభుత్వ భద్రత అంటే రేవంత్ కు అంతగా గురి లేదు. పైగా రాష్ట్రప్రభుత్వ ఇస్తున్న భద్రతను రేవంత్ అనుమానిస్తున్నారు. తన సమాచారాన్ని ప్రభుత్వానికి చేరవేస్తారని. అయితే కేంద్రం మాత్రం ఈ గొడవ మధ్యలో తనకు అనవసరమైన తలపోటు తెచ్చుకోకూడదని కోర్టు ఇచ్చిన బాధ్యత నుండి పక్కకు తప్పుకుంది. కేంద్ర భద్రత ఇచ్చిన అన్నీ తమ చేతులలో ఉండవని ఈ క్రమంలో ఏదైనా హాని జరిగితే అనవసరమైన చెడ్డ పేరని కేంద్రం భావిస్తుంది. మరోవైపు తనను చంపి కొడంగల్ లో ఎన్నికలను వాయిదా వెయ్యాలని తెరాస ప్రయత్నిస్తుందని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు.



