తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాగానే… 6,000 కోట్ల పెట్టుబడులు.. మరి ఏపీకి?

Revanth-Reddy-Davos

ప్రభుత్వాలను రాజకీయ పార్టీలే నడిపిస్తున్నప్పటికీ, ప్రభుత్వం మారిన ప్రతీసారి నిర్ణయాలు, విధానాలను పూర్తిగా మార్చేసుకోనవసరం లేదు. అవసరమనుకున్న కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని ముందుకు సాగితే సుస్థిరత నెలకొంటుంది. దాంతో అభివృద్ధి జరుగుతుంటుంది.

అనేక దశబ్ధాలుగా మన దేశంలో జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఇదేవిదంగా సాగేది కనుకనే ఇంత అభివృద్ధి సాధ్యపడింది. తెలంగాణలో మొదటిసారిగా అధికారంలోకి వచ్చిన రేవంత్‌ రెడ్డి కూడా అభివృద్ధి విషయంలో ఇదేవిదంగా ముందుకు సాగుతున్నారు.

ADVERTISEMENT

అందుకే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 15 రోజులకే సిఎం రేవంత్‌ రెడ్డి తన బృందంతో కలిసి దావోస్ ఆర్ధిక సదస్సుకు వెళ్ళి రాష్ట్రానికి సుమారు 30-40 వేల కోట్లు పెట్టుబడులు సాధించుకున్నారు. అదేవిదంగా గత ప్రభుత్వం హయాంలో పెట్టుబడిరులతో కుదుర్చుకున్న ఒప్పందాలను గౌరవిస్తూ పారిశ్రామిక వాణిజ్య అభివృద్ధికి కృషి చేస్తున్నారు.

అటువంటిదే రెన్యూసిస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీతో చేసుకున్నా తాజా ఒప్పందం కూడా. దీనిని సాధించడం కోసం గతంలో కేసీఆర్‌ ప్రభుత్వం గట్టిగా కృషి చేయగా, రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ఆ సంస్థను సాధరంగా రాష్ట్రానికి ఆహ్వానించి నిన్న ఒప్పందం చేసుకున్నారు.

ఆ సంస్థ తెలంగాణలో రూ.6,000 కోట్లు భారీ పెట్టుబడి పెట్టి దక్షిణాది రాష్ట్రాలలోనే అతిపెద్ద సోలార్ పీవీ మాడ్యూల్స్, పీవీ సెల్స్ తయారుచేసే పరిశ్రమని ఏర్పాటు చేయబోతోంది.

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇంకా మూడు నెలలు కూడా కాలేదు. ఇంత తక్కువ వ్యవధిలోనే రూ.6,000 కోట్లు పెట్టుబడితో అతిపెద్ద పరిశ్రమని సాధించుకుంది.

ఏపీలో జగన్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు 5 ఏళ్ళవుతోంది. త్వరలో పదవీ కాలం పూర్తవబోతోంది కూడా. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ఎన్ని కోట్లు పెట్టుబడులు, ఎన్ని పరిశ్రమలు, వాణిజ్య సంస్థలు, ఐ‌టి కంపెనీలను ఆకర్షించగలిగింది? అంటే జవాబు అందరికీ తెలుసు.

కొత్తవాటిని తీసుకురాకపోగా అమర్ రాజా బ్యాటరీస్, లూలూ గ్రూప్ వంటి అనేక సంస్థలను బయటకు వెళ్లిపోయేలా చేసింది. రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు, ఐ‌టి కంపెనీలు రాకపోయినా ఏం పర్వాలేదు. అందరికీ సంక్షేమ పధకాలతో ‘మేలు’ చేస్తున్నామని వైసీపిలో పై నుంచి క్రింద వరకు అందరూ నిసిగ్గుగా చెప్పుకుంటున్నారు.

కొత్త ప్రభుత్వం అధికారంలోకి రాగానే గత ప్రభుత్వ నిర్ణయాలను అమలుచేయకుండా పక్కనపడేస్తే ఆ రాష్ట్రం పరిస్థితి ఏవిదంగా మారుతుందో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని చూస్తే అర్దమవుతుంది. అదే గత ప్రభుత్వ నిర్ణయాలను, విధానాలను అవసరమైన మార్పులు చేర్పులు చేసుకొని కొనసాగిస్తే ఏవిదంగా ఆ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందో పక్కనే ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని చూస్తే అర్దమవుతుంది.

ADVERTISEMENT
Latest Stories