రేవంత్ రెడ్డి మాటల్లో మర్మమ్ ఏంటి?

Revanth Reddy  waiting for chandrababu naiduటిడిపి వర్కింగ్ అద్యక్షుడు రేవంత్ రెడ్డి డిల్లీలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కొన్ని రోజుల క్రితం కలిసారు. ఆయన కాంగ్రెస్ లో జాయిన్ కావడం దాదాపు కన్ఫర్మ్ అన్నారు. రేవంత్ రెడ్డి కూడా అలాగే బిహేవ్ చేశారు కూడా. ఐతే ఆయన నిన్న తన నియోజకవర్గం ఐన కోడంగల్ వెళ్లారు.

ADVERTISEMENT

అక్కడ చంద్రబాబు తన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చెయ్యను అని, “ఆయన నన్ను నమ్మి వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు. ఆయన నమ్మకాన్ని నేను వమ్ము చెయ్యను. చంద్రబాబు గారు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఆయన వచ్చాక ఆయన నిర్ణయం మేరకు పోరాట పంథాను నిర్ణయిస్తా అని ప్రకటించారు.

దీని బట్టి రేవంత్ రెడ్డి తన నిర్ణయం మార్చుకున్నారా? తెదేపాలోనే కొనసాగనున్నారా? అని కొత్త అనుమానాలు వస్తున్నాయి. అలాగే వచ్చే ఎన్నికల్లో తాను జడ్చెర్ల నుండి పోటీ చెయ్యనున్నాను అనే పుకారును కూడా ఆయన కొట్టి పెడేశారు. రాజకీయాల్లో ఉన్నంత వరకు కోడంగల్ నుండే పోటీ చేస్తా అని చెప్పుకొచ్చారు.

అదే సమయంలో తనకు కోట్ల రూపాయల ప్యాకేజీ ఇస్తామని,మంత్రి పదవి ఇస్తామని ఆశ చూపినా తాను టిఆర్ఎస్ లో చేరలేదని ఆయన అన్నారు. తప్పుడు కేసు పెట్టి జైలులో పెట్టినా భయపడలేదని రేవంత్ అన్నారు. ఐతే రేవంత్ తెదేపాలోని ఇతర నాయకులతో ఇంత జరిగాక కలిసి పనిచెయ్యగలరా అనేది అసలు ప్రశ్న!

ADVERTISEMENT
Latest Stories