RRR-JrNTR-Ram-Charanతెలుగు సినిమా ఏంటి.. ఇండియా లెవ‌ల్లో సగటు సినీ అభిమానికి, ప్రేక్ష‌కులు ఫిల్మ్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ ఇండియా చేసిన ప‌నికి కాస్త ఇబ్బంది ప‌డే ఉంటారు. ఎందుక‌నో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ ఏడాది విడుద‌లై ఘ‌న విజయం సాధించిన RRR సినిమా ఆస్కార్ అవార్డ్ రేసులోకి మ‌న దేశం త‌ర‌పున వెళుతుంద‌ని అంద‌రూ భావించారు. నిజంగా అదే క‌నుక జ‌రిగి ఉండుంటే తెలుగువారైనందుకు మ‌నం ఎంతో గ‌ర్వ‌ప‌డేవాళ్లమే. అయితే ఫెడరేషన్ RRRను పక్కన పెట్టి గుజరాతీ ఫిల్మ్ -చెల్లో షో’ను ఎంపిక చేసింది. నిజానికి RRR ఓ దేశ‌భ‌క్తి ప్ర‌ధానమైన సినిమా. రెండు య‌థార్థ పాత్ర‌ల‌ను ఆధారంగా చేసుకుని ద‌ర్శ‌కుడు రాజమౌళి ఓ ఫిక్ష‌న‌ల్ పాయింట్‌ను జోడించి తెర‌కెక్కించాడు. అందులో న‌టించిన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అంద‌రూ సినిమాను గొప్ప‌గా తీర్చిదిద్దారు.

పాండ‌మిక్ త‌ర్వాత విడుద‌లైన ఈ సినిమా బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కూడా మంచి వ‌సూళ్ల‌నే రాబ‌ట్టింది. కానీ రిలీజ్ ముందు ప్రమోష‌న్స్ పెద్ద‌గా చేసే అవ‌కాశం లేకుండా పోయింది. అంత‌కు ముందు చేసిన ప్ర‌మోష‌న్స్‌కు, సినిమా రిలీజ్‌కు మ‌ధ్య కరోనా వేవ్ ఉండ‌టంతో గ్యాప్ వ‌చ్చేసింది. దీంతో మేక‌ర్స్ సినిమాను రిలీజ్ చేశారు. సోష‌ల్ మీడియాలో ప్ర‌మోట్ చేసుకున్నారు. సినిమా మంచి క‌లెక్ష‌న్స్‌ను రాబ‌ట్టింది. ఆగ‌స్ట్‌లో అమెరికాలో భారీగా ప్ర‌మోష‌న్స్ చేసుకున్నారు. అక్క‌డ స్పెష‌ల్ షోస్ వేశారు. ఓవ‌ర్‌సీస్‌కు సంబంధించిన సినీ ప్ర‌ముఖులు, క్రిటిక్స్ అంద‌రూ సినిమాను చూసి అప్రిషియేట్ చేశారు. సినిమా అద్భుత‌మంటూ ట్వీట్స్ చేశారు. హాలీవుడ్‌కి చెందిన కొంత మంది సాంకేతిక నిపుణులు కూడా RRR సినిమాను సోష‌ల్ మీడియాలో అభినందించారు.

ఇండియాలోనే కాకుండా ఓవ‌ర్ సీస్‌లోనూ మెప్పించిన‌ RRR మూవీ ఆస్కార్ బ‌రిలోకి వెళుతుంద‌ని అంద‌రూ భావించారు. కానీ తీరా సినిమాను మ‌న‌వాళ్లే ఎంపిక చేయ‌లేదు. దీనిపై విమ‌ర్శ‌లు కూడా గ‌ట్టిగానే వినిపిస్తోంది. ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన సినిమాను కాకుండా అస‌లు పేరే తెలియ‌ని ఓ సినిమాను ఎలా ఎంపిక చేశార‌ని కొంద‌రంటే..అస‌లు ఈ సినిమాను ఎంపిక చేయ‌టం వెనుక రాజ‌కీయ కార‌ణాలే క‌నిపిస్తున్నాయ‌ని మ‌రికొంద‌రు అంటున్నారు. ఆస్కార్ అవార్డ్స్ 2023కి మ‌న దేశం త‌ర‌పున ఎన్నికైన చెల్లో షో సినిమా హాలీవుడ్ సినిమాకు ప్రీమేక్ అని, రీమేక్ అని, అలాంటి సినిమాను ఆస్కార్‌కు ఎంపిక చేయ‌ట‌మేంట‌నే వాద‌న‌లు కూడా లేక‌పోలేదు.

ఇలాంటి నేప‌థ్యంలో కొంద‌రైత RRR సినిమా ఆస్కార్‌కు ఎంపిక కాక‌పోవ‌టంపై సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇది విష‌యాల‌ను చూసిన‌ప్పుడు నిజంగా సిగ్గు ప‌డాల్సిందే. RRR సినిమాకు ఆస్కార్‌కు వెళ్లేంత సీన్ లేద‌నేది వారి వాద‌న‌. మ‌రి వెళ్లిన చెల్లో షోను ఇప్పుడు రీమేక్ అనే వార్త‌లు వినిపిస‌త్ఉన్ఆన‌యి. మ‌రి దీన్ని వారెలా స‌మ‌ర్దిస్తారో అర్థం కావ‌టం లేదు. రీమేకో, ఫ్రీమేక్ సినిమానో తెలియ‌దు కానీ.. ఆ సినిమా కంటే ఒరిజిన‌ల్ కంటెంట్‌తో రూపొందించిన RRR దాని కంటే ఎందులో త‌క్కువో అర్థం కావ‌టం లేదు. మ‌న‌కు మ‌న‌కు మ‌ధ్య వంద గొడ‌వ‌లుంటాయి. కానీ కొన్ని విష‌యాలంటూ వ‌చ్చేస‌రికి తెలుగువాళ్లం ఒక‌టి కావాలి. కానీ.. మ‌న‌మే గుద్దేసుకుంటున్నాం. ఇలాగైతే ఇంకొక‌డు ఎలా మ‌ర్యాద ఇస్తాడు. మ‌న మ‌న‌స్త‌త్వాలు ఇలా ఉంటే ఎలా అనేది స‌గ‌టు తెలుగు సినీ ప్రేక్ష‌కుడి ప్ర‌శ్న‌.

అయితే RRR సినిమాను మ‌న వాళ్లు ఎంపిక చేయ‌క‌పోతేనేం. మేం ఎంపిక చేస్తామ‌ని అమెరికాలోని సినీ అభిమానులు అంటున్నారు. ఇంత‌కు ముందు చెప్పిన‌ట్లు ఆగ‌స్ట్‌లో అమెరికాలో RRR ప్ర‌మోష‌న్స్ చేసిన‌ప్పుడు సినిమాకు ట్రెమెండ‌స్ రెస్పాన్స్ వ‌చ్చింది. అలాంటి సినిమాను ఆస్కార్ బ‌రిలోకి ఎంపిక చేయ‌క‌పోవ‌టంపై అమెరికాలోని తెలుగువారు, అక్క‌డున్న డిస్ట్రిబ్యూట‌ర్స్ షాక్ అయ్యారు. అయితేనేం.. అమెరికాలో RRR సినిమాను చూడ‌ని వారి కోసం స్పెష‌ల్ షోస్‌ను వేస్తారు. ఇలా చేయ‌టం వ‌ల్ల‌ హ్యూజ్ రేంజ్ ఆడియెన్స్‌కు ట్రిపుల్ ఆర్ మూవీ రీచ్ అవుతుంది. అదే స‌మ‌యంలో చాలా పేప‌ర్ వ‌ర్క్ చేసుకుంటూ వ‌స్తారు. అలా చేసిన త‌ర్వాత RRR సినిమాను ప‌లు విభాగాల‌కు అమెరికా త‌ర‌పున నామినేట్ చేస్తారు. ఎక్కువ మంది వీక్ష‌కుల నుంచి వ‌చ్చిన ఓపినియ‌న్‌తో RRRను ఆస్కార్ ఎంపిక చేసే అవ‌కాశం ఉంద‌ని యు.ఎస్‌కి చెందిన ఓ ప్ర‌ముఖుడు తెలియ‌జేశారు. అంటే RRRకు ఆస్కార్ దారులు మూసుకుపోలేదు. మ‌నం ప‌ట్టించుకోకుండా రేపు అమెరికా నుంచి మ‌న సినిమా ఆస్కార్ రేసుకి నామినేట్ అయితే ఇప్పుడు సంబ‌రాలు చేసుకున్న వాళ్లంద‌రూ స‌మాధానం ఎలా ఉంటుందో మ‌రి.