జగన్ కేసు: సీజ్ ది ప్రొపర్టీ..!

Jagan Must Prove His Commitment By Disqualifying That MP

ఏళ్ళు గడుస్తున్నా జగన్ అక్రమాస్తుల కేసు విచారణ మాత్రం ఒక కొలిక్కి రావడం లేదు. అయితే ఈ కేసు మరుగున పడిపోలేదు అనేలా ఈ కేసుకు సంబంధించిన ఎదో ఒక వార్త జగన్ కేసును ఎప్పుడు లైవ్ లైట్ లో ఉంచుతూనే వస్తుంది.

అయితే తాజాగా ఈ కేసులో భాగంగా ఇప్పుడు దాల్మియా సిమెంట్స్ కు చెందిన 793 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసినట్లు సమాచారం. అయితే నాటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో సీఎం గా వైస్ రాజశేఖర్ రెడ్డి కడపలోని 417 హెక్టార్ల సున్నపు రాయి గనులను ఈ సంస్థకు లీజుకిచ్చారు.

ADVERTISEMENT

అయితే ఇందులో భారతి సిమెంట్స్ కు సంబంధించి 377 కోట్ల విలువైన భూమికి గాను క్విడ్ ప్రోకో జరిగినట్టు ఈడీ తన విచారణలో బయటపెట్టింది. అయితే ఈ డీల్ మొత్తం పునీత్ దాల్మియా – విజయసాయి రెడ్డి కి మధ్యన జరిగినట్టు ఆధారాలను సేకరిస్తున్నారు అధికారులు.

భారతి సిమెంట్స్ లో దాల్మియా సంస్థ పెట్టుబడులు పెట్టడం ద్వారా వచ్చిన మొత్తంలో సుమారు 55 కోట్లు 2010 – 11 మధ్య జగన్ కు బదిలీ చేసినట్టు గతంలో సిబిఐ ఆరోపించింది. అయితే తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని దాల్మియా సంస్థకు జగన్ అక్రంగా సున్నపు రాయి ని లీజుకి ఇచ్చారని, తద్వారా జగన్ 150 కోట్లు ఆర్జించినట్లు సిబిఐ విచారంలో తెలిపింది.

జగన్ పై ఈ స్థాయిలో అవినీతి ఆరోపణలు వస్తున్నా, ఇన్ని కోట్ల విలువైన ఆస్తులను ఈడీ జప్తు చేస్తున్నప్పటికీ జగన్ ఇంకా అమాయకుడే, ఇవన్నీ కూడా అక్రమ కేసులే, జగన్ కడిగిన ముత్యం అంటూ వైసీపీ వాదించడం వారి అవినీతి రాజకీయానికి నిదర్శనం. అయితే ఈ ఈడీ జప్తు పై చెల్లి షర్మిల ఏ విధంగా స్పందిస్తారో, అన్న మీద ఇంకెన్ని అవినీతి ఆరోపణలు గుప్పిస్తారో చూడాలి.

ఇప్పటికే కొన్ని కోట్ల విలువైన సర్వస్వతి భూముల పై హక్కు మాదంటే మాదంటూ జగన్, తల్లి విజయలక్ష్మి, చెల్లి షర్మిల మీద కోర్ట్ కెక్కారు. ఇప్పుడు 793 కోట్ల విలువైన జగన్ ఆస్తులను ఈడీ జప్తు చేసింది. అసలు విచారణలో ఈడీ అధికారులు జప్తు చేసిన ఆస్తులే జగన్ దగ్గర ఈస్థాయిలో ఉంటే అసలు అధికారుల కంటికి కనిపించని ఆస్తులు ఇంకెన్ని దాగున్నాయో అనే ప్రశ్న ప్రతి సామాన్యుడి మదిలో మెదులుతుంది.

ADVERTISEMENT
Latest Stories