రసకందాయంలో జబర్దస్త్ రాజకీయం!

rumours on roja removal from jabardasth comedy showవివాదాలకు మారు పేరైన వైకాపా ఎమ్మెల్యే రోజా మరోసారి వివాదానికి కేంద్రబిందువు అయ్యింది. ఈసారి ఆమె జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నారు. చిరంజీవి అనేవాడు లేకపోతే పవన్ కళ్యాణ్ ఎక్కడ అని, అలాగే చంద్రబాబు దగ్గర 400 కోట్లు తీసుకుని తెలుగు దేశానికీ తొత్తుగా మారాడని ఇలా రకరకాల విమర్శలు చేసారు రోజా.

ADVERTISEMENT

ఇప్పటికే రోజాపై గుర్రుగా ఉన్న తెలుగు దేశంతో పాటు, జనసేన కూడా ఆ లిస్టులో చేరింది. ఇప్పుడు వీరంతా రోజాని ఈటీవీలో ప్రసారం అయ్యే జబర్దస్త్ నుండి తప్పించేలా ఒత్తిడి చేస్తున్నారట. తద్వారా రోజా ఆర్ధిక మూలాలపైనా ఆమె ఆత్మవిశ్వాసంపై దెబ్బ కొట్టొచ్చు అనేది వారి వ్యూహంగా కనిపిస్తుంది.

జబర్దస్త్ ఎంతో వివాదాస్పదం అయినప్పటికీ ఈటీవీకి అత్యధిక రేటింగ్స్ తెచ్చిపెడుతున్న షో అది. కాబట్టి దానిని మార్పు చెయ్యడం అంత తేలిక కాదు. మరోవైపు ఈ కార్యక్రమం నుండి నాగబాబు తప్పుకోవాలని ఆయన మీద ఒత్తిడి చేస్తున్నారట మెగా అభిమానులు. ఈ మధ్య కాలంలో క్రేజ్‌ను తెచ్చిపెట్టిందే ‘జబర్దస్త్’ కార్యక్రమం. దానిని ఆయన వదులుకోవడం అంత తేలిక కాదు.

ADVERTISEMENT
Latest Stories