ప్రభాస్ హీరోగా రూపొందుతున్న తాజా చిత్రం ‘సాహో’ ఫస్ట్ లుక్ రెండు రోజుల క్రితం విడుదలై వైరల్ అయిన సంగతి తెలిసిందే ప్రభాస్ 38వ పుట్టిన రోజు సందర్భంగా ఈ పోస్టర్ విడుదల కాగా, ఇది ‘బ్లేడ్ రన్నర్ 2049’ పోస్టర్ కు కాపీ అని నెటిజన్లు తేల్చేశారు. ‘సాహో’ పోస్టర్ లో ప్రభాస్ ఫుల్ లెన్త్ జాకెట్ ధరించి, ముఖానికి మాస్క్ కట్టుకుని నడుస్తున్నట్టు కనిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ ఫోజ్ ‘బ్రేడ్ రన్నర్’ సిరీస్ చిత్రాల్లో ర్యాన్ గోస్లింగ్, హారిసన్ ఫోర్డ్ ల ఫోజేనని చెబుతూ రెండు చిత్రాలనూ పోల్చుతూ ఫొటోలు షేర్ చేస్తున్నారు. ఆ చిత్రాలను మీరూ చూడవచ్చు. ఇటీవల కాలంలో ప్రతి పెద్ద సినిమా కూడా ఇలాంటి కాపీ గోలలో చిక్కుకుంటున్న నేపథ్యంలో… “సాహో” కూడా అందుకుమినహాయింపు కాదని నిరూపణ అయ్యింది. కాపీ అయినా గాని ప్రభాస్ కటౌట్ కి ఈ పోస్టర్ అదిరిపోయింది అంటున్నారు యంగ్ రెబల్ స్టార్ ఫ్యాన్స్.


