సందర్భం, సమయం ఏదైనా దానికి అనుగుణంగా స్పందిచడమే మెగాస్టార్ చిరంజీవికున్న ప్రత్యేకమైన లక్షణంగా సన్నిహిత వర్గాలు పేర్కొంటాయి. అయితే ఇది రాజకీయ రంగంలో మాత్రం కాదులెండి. ఒక్క పొలిటిక్స్ ను పక్కన పెడితే… మెగాస్టార్ మెగాస్టారే అన్న రేంజ్ లో అభిమాన సందోహం గుమిగూడుతుంది. తాజాగా ఐఎస్ఎల్ టోర్నీలో భాగస్వామి అయిన చిరుకు సంబంధించిన ఓ ఫోటో చూపరులను ఆకట్టుకుంటోంది.
‘క్రికెట్ దేవుడు’ సచిన్ టెండూల్కర్ తీసిన ఓ సెల్ఫీ ఫోటోలో పిల్లలతో పాటు తానూ కూడా కనపడాలన్న ఉద్దేశంతో… పిల్లలతో పాటు కలిసిపోయి… నిజంగానే ఓ చిరునవ్వు చిందించాడు మెగాస్టార్. సచిన్ తో సెల్ఫీ దిగుతున్నామన్న ఆనందం అక్కడున్న పిల్లలలో ఎంతైతే కనపడిందో, అంతకుమించిన ఆనందం చిరంజీవిలో కనపడుతోంది. ఒక రకంగా చెప్పాలంటే… పిల్లలకే పిల్లోడు మాదిరి… మెగాస్టార్ తయారయ్యారు.
ADVERTISEMENT
ADVERTISEMENT



